AP Politics: ఏపీలో అధికార పార్టీ బీజేపీ మళ్ళీ 2024 ఎన్నికలలో కూడా అధికారంలోకి రావాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. దానికి తగ్గట్లుగా ప్రణాళికలు వేసుకొని ముందుకి వెళ్తుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలతో ప్రజలని ఆకట్టుకొని, ఓటు బ్యాంకు సొంతం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. అయితే దీనికి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అడ్డుకట్ట వేయబోతుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. గత కొంత కాలంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుని మళ్ళీ సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఈ హత్యకేసులో నిందితులుగా ఉన్నవారిని చర్లపల్లి జైలుకి తరలించారు. ఇక వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటికే విచారించారు.
త్వరలో ఈ కేసుకి సంబందించిన ఇన్వెస్టిగేషన్ ముగింపు దశకి వస్తుందని భావిస్తున్నారు. నిందితులు ఎవరు, హత్య ఎందుకు జరిగింది అనే విషయాలు బయటపెట్టబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకి సంబందించిన నిధులని ఇస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల ఐడెంటిటి పూర్తిగా చెరిపేసి తమ పథకాలుగానే ప్రచారం చేసుకుంటుంది. దీనిని కేంద్ర మంత్రులు ఇప్పటికే ఏపీ వచ్చి గుర్తించారు. తాజాగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది.

కేంద్రం ఇచ్చే పథకాలకి తమ పేరు లేకుండా మీ పేర్లతో ప్రచారం చేసుకుంటే కంప్లీట్ గా వాటికి సంబందించిన నిధులని ఆపేస్తాం అంటూ హెచ్చరించారు. ఇవన్ని ఒక ఎత్తైతే తాజాగా ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ ని నియమించింది. ఈయన అయోధ్య రామమందిరం కేసుని విచారించిన ధర్మాసనంలో ఒకరు. రామమందిరం తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వడంతోనే ఇప్పుడు అబ్దుల్ నజీర్ కి గవర్నర్ గా అత్యున్నత హోదా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే అబ్దుల్ నజీర్ తో వైసీపీ నిర్ణయాలకి, ఆలోచనలకి చెక్ పెట్టాలని బీజేపీ చూస్తుందనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇదంతా పవన్ కళ్యాణ్ బీజేపీని అడిగిన రూట్ మ్యాప్ లో భాగంగానే జరుగుతుంది అనే టాక్ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది.