తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటినుంచో బీజేపీ పార్టీ బాగా వేయాలని ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో హిందుత్వ అజెండాతో సక్సెస్ అయిన భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దానిని బలంగా ఉపయోగించలేక పోతుంది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వ అజెండా అనేది అస్సలు పనిచేయడం లేదని చెప్పాలి. సుదీర్ఘకాలంగా తెలుగు రాష్ట్రాల్లో పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నా బీజేపీకి ప్రస్తుతం తెలంగాణలో ఆ అవకాశం లభించింది.
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు, బలమైన నాయకత్వ లోపం, సీనియర్లు జూనియర్లు కలుసుకొని వెళ్లే తత్వం లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీని వారు బలంగా ఎదుర్కోలేకపోతున్నారు. దీంతో అవకాశం భారతీయ జనతా పార్టీ వినియోగించుకుంటుంది. బండి సంజయ్ నేతృత్వంలోని తెలంగాణ బిజెపి పార్టీ సమిష్టిగా పనిచేస్తూ కేసీఆర్ ని బలంగా ఢీకొనే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి కూడా బిజెపి పార్టీ దూసుకెళ్లింది.
క్షేత్రస్థాయిలో కార్యవర్గాన్ని బలంగా ఏర్పాటుచేసుకుంది. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టిగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. టార్గెట్ 90 పేరుతో జనాల్లోకి వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇక హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ కూడా తెలంగాణపై గట్టి ఫోకస్ పెట్టారు. వారిద్దరిలో ఎవరో ఒకరు తెలంగాణలో ఏదో ఒక నియోజకవర్గ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.
అలా పోటీ చేయడం ద్వారా ప్రజల్లోకి మంచి సంకేతాలు పంపించినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అలాగే విస్తృతంగా తెలంగాణకు వచ్చి మీటింగ్లో ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. ఈసారి కర్ణాటక తో పాటు తెలంగాణలో బిజెపి జెండా ఎగరేయాలని కృత నిశ్చయంతో ఆ పార్టీ అధిష్టానం ఉంది. తెలంగాణలో హిందుత్వ జెండా కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చాలామంది ప్రజలు దానికి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో రానునే ఎన్నికల్లో కేసీఆర్ కి బిజెపి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.