NBK 108: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. వరుస కమర్షియల్ సక్సెస్ లతో మంచి జోరు మీద ఉన్న దర్శకుడిగా అనిల్ రావిపూడి బాలయ్యని తన సినిమాలో ఎలా ప్రెజెంట్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
ఇక మూవీలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించబోతుంది. ఇక బాలయ్య సినిమాలో మూడు భిన్నమైన పాత్రలలో దర్శనం ఇస్తాడని తెలుస్తుంది. ఇక పూర్తిగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో బాలయ్య పాత్ర కూడా తెలంగాణ యాసలోనే ఉంటుంది. ఇక తెలంగాణ స్లాంగ్ లో బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాని ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో విలన్ పాత్ర కోసం అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ ని పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీని రంగంలోకి దించుతున్నారని తెలుస్తుంది. బాహుబలిలో ఆమె ఐటెం సాంగ్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకి చేరువ అయ్యింది. ఇప్పుడు ఆమెని ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఎంపిక చేసినట్లుగా ప్రకాచారం నడుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది వేచి చూడాలి.