బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. టాలీవుడ్లో ‘నెం 1 నేనొక్కడినే’ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన కృతి సనన్ నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఎత్తు విషయంలో తనకు సరైన జోడి అని ఆ మూవీ ఫంక్షన్లో మహేశ్ బాబు మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి ‘దోచెయ్’ సినిమాలో అలరించింది. అనంతరం తెలుగులో ఆశించినంతగా అవకాశాలు రాకపోయేసరికి మళ్లీ బాలీవుడ్ కి బాట పట్టింది. తాజాగా కృతి నటిస్తున్న సినిమా ‘బచ్చన్ పాండే’. బాలీవుడ్ యాక్షన్, కామేడీ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి పూర్తి స్థాయిలో మసాలా ఎంటర్టైనర్ను అందించడానికి సిద్ధమైంది.
ఈ సినిమాలో డైరెక్టర్‌గా మైరా దేవేకర్గా కృతి సనన్ అలరించనుంది. దర్శకురాలిగా నటించడంపై ‘కృతి ఒక నటిగా మీరు నిర్దిష్ట సంఖ్యలో చిత్రాలను పూర్తి చేసిన తర్వాత మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా నటించాలనుకుంటారు. ఈ యాక్టింగ్ కేవలం చుట్టూ ఉన్న పరిసరాను గమనించడం ద్వారా దర్శకులు ఎలా తెరకెక్కించాలనుకుంటారో అర్ధమైంది. వారి దృష్టి కోణం, తీర్చిదిద్దే విధానం, ప్రవర్తనలపై ఆధారపడి ఉంటాయి. ఇదంతా నేను చాలా టాలెంటెడ్ డైరెక్టర్లలో చూశాను. వారి నుంచి నేర్చుకోవడం నాకు చాలా సులభమైనట్లు అనిపిస్తుంది. ఒక దర్శకుడు సెట్లో అన్ని కంట్రోల్ ఉంచుతూ కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా ఉంటారు. అలాగే మైరా ఒక ప్రదేశంలో ఇరుక్కుపోయి, పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందనేదే ఈ సినిమా ‘. అని తెలిపింది.