Brahmaji : యాంకర్ సుమ వాగ్దాటి ముందు మహామహులే నిలవలేరు. అలాంటిది ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సుమ నోరు మూయించడం ఆసక్తికరంగా మారింది. షో ఏదైనా సరే.. అక్కడ బ్రహ్మాజీ ఉన్నారంటే ఆయనను ఒక ఆట ఆడుకుంటుంది సుమ. ఆయన వయసుపై జోకులు వేస్తూ తెగ హంగామా చేసేస్తుంది. బ్రహ్మాజీ ఏమైనా తక్కువ తిన్నాడా? అంటే.. ఆయన కూడా సుమకు ధీటుగానే కౌంటర్ ఇచ్చేస్తాడు. వీరిద్దరి కాంబో ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఆద్యంతం చాలా ఫన్నీగా సాగుతుంది. ఒకరిపై మరొకరు వేసుకునే పంచులతోనే షోని హైలైట్ చేసేస్తారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతీశెట్టి, కేథరిన్ హీరోయిన్లు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది.
‘మాచర్ల నియోజకవర్గం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో.. ‘‘నాట్య విధ్వంసులు.. సారీ నాట్య విధ్వాంసులు.. ఆయనకు ఎన్నో కళలు వచ్చాయి. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మణిపూరి, ఒడిస్సి, పానీ పూరి ఇలా అన్నీ వచ్చు..కానీ ఇన్నేళ్లు తనలోనే దాచుకున్నాడు.. ఇంకా ఎన్నాళ్లు ఇలానే ఉంచుతారు.. బయటకు తీయండి’’ అంటూ బ్రహ్మాజీని యాంకర్ సుమ ఓ ఆట ఆడేసుకుంది. మరి బ్రహ్మాజీ ఊరుకుంటాడా? స్టేజ్ మీదకు వచ్చి.. తన మాటలతో సుమ నోటికి తాళం వేశాడు. గత వారమే మంచి సినిమాలు వచ్చాయని… కొత్త కంటెంట్ రావడంతో జనాలు థియేటర్లకు వస్తున్నారని.. మన కంటెంట్ కూడా చాలా ఓల్డ్ అయిందని బ్రహ్మాజీ తెలిపాడు.
Brahmaji : సుమతో కలిసి స్టెప్పులు
అంతటితో ఆగాడా? మనం లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం.. జనాలకు మన కాంబో బోర్ కొడుతుంది.. ఓవర్ యాక్షన్ చేయొద్దు.. ఆపేద్దాం అంటూ బ్రహ్మాజీ ఇచ్చిన కౌంటర్‌కి సుమ షాక్ అయ్యింది. మొత్తానికి బ్రహ్మాజీ తన స్పీచ్‌తో అక్కడ ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సుమ, బ్రహ్మాజీ కలిసి వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో కొత్త నితిన్‌ను చూస్తారంటూ బ్రహ్మాజీ వెల్లడించాడు. ఇంత వరకు లవర్ బాయ్ ఇమేజ్‌లో చూశారని.. ఇందులో మాత్రం కిక్ యాస్లా ఉంటాడని తెలిపాడు. ఈ వారం విడుదలైన చిత్రాలు హిట్ అయ్యాయి.. వచ్చే వారం రాబోతోన్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను కూడా బ్లాక్ బస్టర్ చేయాలంటూ ప్రేక్షకులను కోరాడు బ్రహ్మాజీ.