AP Politics: ఏపీ రాజకీయాలలో అన్ని పార్టీలు ఎవరికి వారు తమ వ్యూహాలని అమలు చేస్తూ ప్రజలలోకి వెళ్తున్నారు. అయితే ఎవరి బలం ఎంత అనేది ఇప్పుడే నిర్ణయించడానికి అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఏపీలో తన రాజకీయ ప్రయాణం మొదలు పెట్టింది. అయితే అధికార వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలని వ్యూహాలువేస్తుంటే, ప్రతిపక్ష టీడీపీ కూడా అధికారం కోసం నారా లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు పర్యటనతో ప్రజలలోకి వెళ్తున్నారు. అయితే జనసేనాని మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో మరో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి పొత్తు ప్రతిపాదన పంపించారు. అయితే జనసేనాని అడిగే సీట్లు ఇవ్వడానికి టీడీపీ అధినేత సిద్ధంగా లేరు.
ఈ నేపధ్యంలో గత రెండు నెలలుగా జనసేనాని సైలెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో జనసేనాని పొత్తుకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్, జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం కచ్చితంగా చాలా మంది నాయకులు ఈ కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకుంటున్న ఏపీ ప్రజలు బీఆర్ఎస్, జనసేన కూటమికి పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఇక తోట చంద్రశేఖర్ కూడా ఆవ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారనే టాక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
తాజాగా తోట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై అప్పటి సమీకరణాల ఆధారంగా చర్చ జరుగుతుందని తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కి కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ ఇచ్చాడు అనే ప్రచారం పచ్చి అబద్ధం అని అన్నారు. ఒక అలాంటి వాస్తవాలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నారు. అలాగే బీఆర్ఎస్ ఏపీలో అధికారంలోకి రావడానికి ఎలా వెళ్ళాలి అనేది కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. మీరు పొత్తులు పెట్టుకుంటే సంసారం, ఇతరులు పెట్టుకుంటే వ్యభిచారం అనే పద్ధతిలో ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఉన్నాయని అన్నారు. తోట చంద్రశేఖర్ వ్యాఖ్యల బట్టి బీఆర్ఎస్, జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.