ఆటోను బస్సు ఢీకొనడంతో ఆరుగురు మహిళలు మృతి చెందారు
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఆదివారం ఓ ప్రైవేట్ బస్సు ఆటో రిక్షాను ఢీకొనడంతో ఆరుగురు మహిళలు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.

తాళ్లరేవు మండలం సీతారామపురం సమీపంలో జాతీయ రహదారి 216పై ఈ ప్రమాదం జరిగింది.
దీంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితులు యానాంలోని నీలపల్లికి చెందినవారు. వారంతా రొయ్యల యూనిట్ ఉద్యోగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీస్తున్నామని ఓ అధికారి తెలిపారు.
