తెలుగమ్మాయిలకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయిన కోలీవుడ్ లో మాత్రం బాగా సక్సెస్ అవుతూ ఉంటారు. అలాంటి సావిత్రి నుంచి నేటి అంజలి, బిందుమాధవి వరకు అందరికి ఈ రూల్ వర్తిస్తుంది. తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా సక్సెస్ అయిన తెలుగమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ సక్సెస్ వచ్చిన కూడా తెలుగు హీరోయిన్స్ పట్ల మన దర్శక నిర్మాతల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. టాలీవుడ్ లో హీరోయిన్స్ అంటే ఎక్కువగా గ్లామర్ డాల్స్ గా మాత్రమే ఉంటారు. అయితే తెలుగమ్మాయిలు ఈ విషయంలో అంతగా దర్శకులకి కోపరేటివ్ గాఉండరనే టాక్ ఉంది. అలాగే తెలుగు అమ్మాయిల పట్ల ప్రేక్షకులు కూడా అంత ఆసక్తి చూపించారని ఉద్దేశ్యంతో గ్లామర్ రోల్స్ కోసం ఇతర రాష్ట్రాలకి చెందిన అందాల భామలని ఎక్కువగా తీసుకుంటారు.
ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో అంజలి, శ్రీదివ్య, హాసిని లాంటి అందాల భామలు తమిళ తెరపై మెరుస్తున్నారు. ఇప్పుడు ఈ దారిలోకి మరో బ్యూటీ కూడా చేరింది. కలర్ ఫోటో సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ తెచ్చుకొని తరువాత కుందనపు బొమ్మ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా చాందిని చౌదరి తెరంగేట్రం చేసింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. తరువాత చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. అయితే కలర్ ఫోటోతో హీరోయిన్ గా సక్సెస్ అందుకుంది. తరువాత వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
రీసెంట్ గా కిరణ్ అబ్బవరంకి జోడీగా సమ్మతమే సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ కోలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. అశోక్ సెల్వన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంగా చాందిని చౌదరి హీరోయిన్ గా ఖరారైంది. ఈ సినిమాలో చాందినితో పాటు మేఘా ఆకాష్ మరో హీరోయిన్ గా ఉంది. అలాగే మలయాళీ యాక్టర్ కార్తీక ముకుందన్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. ఈ సినిమా చాందినికి తమిళ్ లో ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది వేచి చూడాలి.