AP Politics: ఏపీలో పొత్తుల సమీకరణాలు మారుతున్నాయా అంటే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగోచ్చు. ఇక్కడ అద్భుతాలని ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. జనసేన ఒంటరిగా వెళ్లి అత్యధిక స్థానాలలో గెలవొచ్చు. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ మళ్ళీ పొత్తు పెట్టుకోవచ్చు అనే మాట కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. నిజానికి ఏపీలో బీజేపీ పార్టీ సొంతగా ఎదగాలని దసాభ్దాలుగా ప్రయత్నం చేస్తుంది. అయితే బీజేపీకి ఏపీలో ఆ అవకాశం రాకపోయిన తెలంగాణలో ఉంది. ఏపీలో మాత్రం బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి నాయకులు జనసేనతో కలిసి తమ ప్రయాణం సాగుతుందని చెబుతున్నారు.
వచ్చే ఎన్నికలలో మూడో కూటమిగా తాము పోటీలో ఉండి అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేనతో పొత్తు అంటూనే చంద్రబాబు చెయ్యి పట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఎలా అయినా ముందు నిలబడాలి అంటే మాత్రం చంద్రబాబు సపోర్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఇది బీజేపీ నేతలకి అస్సలు ఇష్టం లేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఏం మాట్లాడిన కేంద్రంలో పెద్దలతో తనకి మంచి సంబంధాలు ఉన్నాయి. వారితోనే చర్చించి నిర్ణయాలు తీసుకుంటా అని చెబుతున్నారు. ఏపీలో బీజేపీ నాయకులని అస్సలు పట్టించుకోవడం లేదు.
ఇదిలా ఉఇంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీని తమ గూటికి తెచ్చుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా బీజేపీలో తనకి అనుకూలంగా ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి వారితో ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీలో పెద్దలు ఏప్రిల్ తర్వాత దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లుగా టాక్. ఈ నేపధ్యంలో అప్పుడే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రంలో పెద్దలని ఒప్పించి పొత్తులపై ఒప్పందం చేసుకునే వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.