సంక్రాంతి పండగ వచ్చిందటే ఏపీలో కోడిపందేల హడావిడి మొదలవుతుంది. సంక్రాంతి ముందు వరకు పోలీసులు ఈ కోడి పందేలు, గ్యాంబ్లింగ్ ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా సంక్రాంతి మూడు రోజులు మాత్రం వాటిని అడ్డుకునే ధైర్యం పోలీసులు చేయలేరు. దీనికి కారణం ఈ కోడిపందేలలో పెద్ద పెద్ద నాయకుల ఇన్వాల్వ్ మెంట్ ఉండటమే. ప్రత్యేకించి అన్ని పార్టీలకి చెందిన నాయకులు కూడా కోడపందేల పోటీలలో పాల్గొంటారు.ఎప్పుడైనా రాజకీయాలు కానీ సంక్రాంతి సమయంలో అందరూ ఒకటే అనే విధంగా గోదావరి జిల్లాలలో సందడి ఉంటుంది . ఇదిలా ఉంటే ఈ సంక్రాంతి కూడా అదే రేంజ్ లో సందడి ఉంది. లక్షలాది సంఖ్యలో ప్రజలు కోడిపందేలు వీక్షించడానికి గోదావరి, కృష్ణా జిల్లాలకి వెళ్ళారు.
ఇక కోడిపందేలలో బెట్టింగ్ రూపంలో కోట్లాది రూపాయిలు చేతులు మారుతాయనే సంగతి తెలిసిందే. చాలా మంది బెట్టింగ్ గ్యాంగ్ లు రంగంలోకి దిగడంతో పాటు, స్థానికంగా ఉన్న వ్యాపారులు కూడా కోడిపందేల మీద కోట్లాది రూపాయిలు బెట్టింగ్ లు కడుతూ ఉంటారు. వీటిలో కొంత మంది లాభపడితే మరికొంత మంది నష్టపోతూ ఉంటారు. ఐపీఎల్ రేంజ్ లో ఇక్కడ బెట్టింగ్ లు నిర్వహిస్తూ ఉంటారు . ఈ సారి కూడా అలాగే కోడిపందెలలో సుమారు 1000 కోట్ల మేరకు బెట్టింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది.
అలాగే పేకాట, గుండాటల ద్వారా కూడా వందల కోట్ల రూపాయిలు చేతులు మారినట్లుగా భావిస్తున్నారు. అస్సలు లెక్క లేకుండా ఈ కోడిపందేల కోసం డబ్బులని వ్యాపారులు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ బెట్టింగ్ లు ఏ స్థాయిలో జరిగాయనే విషయంపై కచ్చితమైన లెక్కలు మాత్రం బయటకి రావు. అయితే ఈ బెట్టింగ్ లలో ఎక్కువగా వైసీపీ నేతలు భాగస్వామ్యం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.