Sam and Rashmika : ఇద్దరు టాప్ హీరోయిన్స్ మధ్య నటన విషయంలో వార్ నడుస్తోందంటూ చూసేవారికి భలే ముచ్చటేస్తుంది. ఒకరి కంటే ఒకరు పోటీ పడి నటిస్తుంటేనే అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ప్రొఫెషనల్ రైవలరీ అనేది శృతి మించనంత వరకే అందంగా ఉంటుంది. శృతి మించితే అభాసుపాలవుతుంది. నటన విషయంలో ఎంత పోటీ పడినా అది చూసేవారికే కన్నుల పండుగే కానీ తొక్కేసే ధోరణి మాత్రం ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే టాక్ బలంగానే వినిపిస్తోంది. వారు మరెవరో కాదు.. సమంత, రష్మిక మందన్నా. ముద్దుగుమ్మలిద్దరి మధ్య ఓ కోల్డ్ వార్ నడుస్తోందనే టాక్ బాగా వినిపిస్తోంది.
Sam and Rashmika : ఒక్క సినిమాను కూడా అధికారికంగా ప్రకటించలేదు..
పాన్ ఇండియా హీరోయిన్స్ లిస్ట్‌లో సమంత టాప్‌లో ఉంది. అమ్మడికి సర్వేలు సైతం మద్దతుగా నిలుస్తున్నాయి. ఇటీవల ఆర్ మాక్స్ అనే సంస్థ చేసిన సర్వేలో కూడా నటి సమంతనే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తర్వాతి స్థానాల్లో సరిపెట్టుకోవల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అమ్మడు ఇటీవలి కాలంలో ముద్దుగుమ్మ పాన్ ఇండియాపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. బీటౌన్‌లో సామ్ చాలా చిత్రాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఒక్క సినిమాను కూడా అధికారికంగా ప్రకటించ లేదు. కానీ నాలుగైదు సినిమాలకు కమిట్ అయ్యిందన్న టాక్ మాత్రం బీభత్సంగానే వినిపిస్తోంది. అయితే అమ్మడు మాత్రం బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై నోరు మెదపడం లేదు. దీనికి కారణం రష్మికయే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
నిజానికి రష్మిక ‘పుష్ప’ చిత్రం ద్వారానే బాలీవుడ్ ఆడియెన్స్‌కు దగ్గరైంది. అయితే ఈ ముద్దుగుమ్మ అంతకు ముందే ఓ బాలీవుడ్ మూవీలో నటించింది. కానీ అది ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో అమ్మడి స్పీడ్‌కు బ్రేక్ వేసే పనిలో సామ్ ఉందని గుసగుసలు గట్టిగానే వినబడుతున్నాయి. తాను నటిస్తున్న మూడు పెద్ద ప్రాజెక్ట్స్‌ను ఒకేసారి అనౌన్స్ చేసి రష్మికకు షాక్ ఇవ్వాలనుకుంటోందట. వీరిద్దరి మధ్య ఈ స్థాయిలో ప్రొఫెషనల్ రైవల్రీ ఎలా పుట్టింది అనేది అర్ధం కాకుండా ఉంది. ఏదేమైనా రానున్న రోజుల్లో మాత్రం బాలీవుడ్లో సామ్ వర్సెస్ రష్మిక వార్ పీక్స్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.