ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాదు పలు భాషల్లో బిగ్‌బాస్ రియాలిటీ షో కి ఉన్నక్రేజ్ మామూలుది కాదు. ఇంటింటా ఆడియన్స్‌ని అలరిస్తూ ప్రేక్షకాదరణ పొందుతూవస్తుంది. అయితే కొందరు మాత్రం బిగ్‌బాస్ రియాలిటీ షోని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది సాంస్కృతిక దోపిడీ అంటూ విరుచుకుపడుతున్నారు. తెలుగులో ఇప్పటికే 5 సీజన్లను విజయంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఓటీటీ ప్రసారానికి సిద్ధమైంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు ఈ షో ప్రసారం కావడానికి సిద్ధం గా ఉంది. తాజాగా సీపీఐ నేత నారాయణ బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
బిగ్‌బాస్ షో రెడ్‌లైట్ ఏరియా కన్నా డేంజర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. బిగ్‌బాస్ అనేది సమాజానికి నేరపూరితమైన సంస్థ అని, ఇది ఓ కల్చరల్ షో, కల్చరల్ ఈవెంట్, గేమ్ షో కాదని, లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌజ్ అని ఆయన విరుచుకుపడ్డారు. సంబంధంలేని యువతి, యువకులను ఒకే ఇంట్లో పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటమే అని ఆయన మండిపడ్డారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ కూడా చేశారు.
స్టాప్ బిగ్‌బాస్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రత్యేకంగా ప్రచారం కూడా షురూ చేశారు సీపీఐ నారాయణ. నిజానికి బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి కూడా సిపిఐ నారాయణ ఒక వీడియో విడుదల చేస్తుంటారు. గతంలో కూడా ఈ షోపై చాలా సార్లు అభ్యంతరం వ్యక్తం చేసారు ఆయన, ఇదో బూతుల ప్రపంచం అని, ఈ బూతుల ప్రపంచాన్ని వందల, వేల కోట్ల వ్యాపారాలకు ఉపయోగపడే పద్ధతుల్లో బిగ్ బాస్‌కి అనుమతి ఇవ్వడం అని చాలా ఘోరం అని పేర్కొన్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానున్న నేపథ్యంలో నారాయణ మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.