Krishna Vamshi తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ డైరెక్టరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన తీసిన సినిమాలు అలా ఉంటాయి కాబోలు. ప్రేక్షకుడి నాడిని పట్టి విభిన్న రీతిలో వినోదాన్ని అందించడం ఆ దర్శకుడికి అలవాటు. అయితే ఇప్పుడు ఆయన సిల్క్ అంటూ ఓ కంపెనీని స్ట్రాట్ చేశాడు.
అవును క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇప్పుడు ఓ కొత్త కంపెనీని ప్రారంభించాడు. దానిపేరు Silk. అంటే ఇదేదో వస్త్రాల కంపెనీ కాదు.. ఆడియో కంపెనీయే. డిఫరెంట్ గా ఆలోచించి కావాలనుకున్న పేరు పెట్టుకున్నారు కృష్ణవంశీ. దీనికి అర్థం ఏంటంటే S అంటే సీతారామశాస్త్రి, IL అంటే ఇళయరాజా, K అంటే కృష్ణవంశీ అని వచ్చేలా దీన్ని పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాగానే కృష్ణవంశీ అభిమానులు, సినీ వర్గాలు సైతం దీని గురించే చర్చించుకుంటున్నాయి.
కృష్ణవంశీకి సీతారామశాస్త్రి అన్నా, ఇళయరాజా అన్నా చాలా అభిమానం, ఎంతో గౌరవం కూడా. సీతారామశాస్త్రికి కృష్ణవంశీ దత్తపుత్రుడని చెబుతారు. అలా ఉండేది వీరి మధ్య బాండింగ్. అందుకే ఆయన వీరిద్దరిని కలుపుతూ Silk అనే ఆడియో కంపెనీని పెట్టుకున్నారని తెలుస్తోంది. తాజాగా కృష్ణవంశీ రంగ మార్తాండ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అన్నీ పనులు చక్కబెట్టుకొని ఈ సినిమా ఇక విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా పాటలు సైతం Silk కంపెనీ ద్వారానే విడుదలవ్వనున్నట్లు సమాచారం. మరాఠా సినిమా నటసమ్రాట్ సినిమాకు రంగ మార్తాండ అఫిషియల్ రీమేక్. మొత్తానికి కృష్ణవంశీ తను అభిమానించే వారి పేరుమీద ఓ ఆడియో కంపెనీని ఏర్పాటు చేసుకోవడం హర్షించదగ్గ విషయమని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.