Nitin Song : క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ప్రముఖ యూట్యూబ్ సెలబ్రిటీ మాత్రమే కాదు.. కొన్నిసార్లు వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తుంటుంది. దీంతో ధనశ్రీకి సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ఓ రేంజ్‌లో ఉంటారు. మరోవైపు లేటెస్ట్ అండ్ బాగా ఫేమస్ అయిన పాటలకు డ్యాన్స్ చేసి.. వాటి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది.
ముఖ్యంగా ధనశ్రీ కొన్ని బాగా పాపులర్ అయిన తెలుగు పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల మాచర్ల నియోజకవర్గం చిత్రంలోని పాపులర్ తెలుగు పాట ‘రా రా రెడ్డి’కి డ్యాన్సులతో అదరగొట్టింది. రారా రెడ్డిలో పాపులర్ అయిన `రాను రాను అంటుందే సిన్నదో` పాట రీమిక్స్ క్లిప్ కొన్ని రోజులుగా వైరల్ గా మారింది. దీనిపై ఇన్ స్టా రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ధనశ్రీ కూడా ఈ క్లిప్‌కే డ్యాన్స్ చేసి అదరగొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ధనశ్రీ.. ‘మీలోని టాలెంట్‌ని వెలికితీయండి. మీ ఎనర్జీ ఎప్పుడూ చాలా గొప్పది.. అది మీరు మాట్లాడక ముందే మిమ్మల్ని పరిచయం చేస్తుంది’’ అని పోస్ట్ పెట్టింది.
Nitin Song : వీడియోకు 30 లక్షలకు పైగా వ్యూస్..
ధనశ్రీ డ్యాన్స్ ఏమో కానీ.. ఆమె వీడియో టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ సినిమాకి బోలెడంత ప్రచారం కల్పిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇక ఆమె డ్యాన్స్, ఎనర్జీ, గ్రేస్‌తో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్లిప్‌కి ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్‌లో 30 లక్షలకు పైగా వ్యూస్ దక్కాయి. ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో నితిన్- కృతి శెట్టి జంటగా నటించారు. సముద్రఖని విలన్‌గా నటించిన ఈ చిత్రంలో పలువురు క్రేజీ స్టార్లు నటించారు. వహించారు. మహతి సాగర్ సంగీతం అందించిన పాటలు ఆకట్టుకున్నాయి.