Darling Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఇండియన్ వైడ్ గా ఆయన మీద ఏకంగా 2000 కోట్ల వరకు పెట్టుబడులు నిర్మాతలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన సినిమాలు ఏకదాటిగా చేస్తున్నా కూడా వేటి నుంచి కూడా ప్రొపెర్ అప్డేట్ మాత్రం రావడం లేదు. ఓ విధంగా చెప్పాలంటే సినిమాలకి సంబందించిన అప్డేట్స్ లేకపోవడంతో రెబల్ స్టార్స్ ఫ్యాన్స్ అందరూ అసహనంతో ఉన్నారు. సలార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
ఇక ఆది పురుష్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రాజెక్ట్ కె మూవీ సెట్స్ పైన ఉంది, మారుతిదర్శకత్వంలో సినిమా కూడా సెట్స్ పైన ఉంది. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకతంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. అలాగే సిద్దార్ద్ ఆనంద్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. ఇలా గ్యాప్ లేకుండా చేతిలో అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా వేటి నుంచి కూడా అప్డేట్ లేదు.
దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమకి సలార్ కి సంబందించిన అప్డేట్ కావాలంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అలాగే ప్రాజెక్ట్ కె అప్డేట్ కూడా ఇవ్వాలి అంతో నాగ్ అశ్విన్ కి ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి వైరల్ గా మారుతున్నాయి. గత ఏడాది వచ్చిన రాదేశ్యామ్ డిజాస్టర్ కావడంతో కచ్చితంగా ఒక సాలిడ్ అప్డేట్ ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే త్వరలో సలార్ మూవీ షూటింగ్ విశాఖ పోర్ట్ లో జరగబోతుంది అని తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. పోర్ట్ లో ఒక 15 రోజుల పాటు షూటింగ్ చేయడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నెలలోనే ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం.