Delhi : దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలో వరుసగా చోటు చేసుకుంటున్న దారుణాలు అందరిని ఆందోళనను గురిచేస్తున్నాయి. మహిళల భద్రతతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రీసెంట్‌గా ముంబైలో తనతో సహజీవనం చేస్తున్న మహిళను దారుణంగా చంపి పరుపులో కుక్కి పరారయ్యే ప్రయత్నం చేసి పోలీసుల చేతికి చిక్కిన ఘటన గురించి చర్చిస్తున్న తరుణంలోనే ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయినే అత్యంత కిరాతకంగా చంపాడో యువకుడు.

ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల సాహిల్ గెహ్లాట్ 23 ఏళ్ల నిక్కీ యాదవ్ లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన ఓ గొడవ పెద్ద వాగ్వాదానికి దారి తీసింది ఎత సర్ది చెప్పినా ప్రియురాలు వినకపోవడంతో క్షణికావేషంలో సాహివాల్ ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి, తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె డెడ్ బాడీని ఫ్రిజ్లో దాచాడు. తమ ఫ్యామిలీకి చెందిన ఓ దాబాలోని ఫ్రిజ్‌లో ఆమె బాడీని భద్రపరిచాడు. ప్రియురాలిని చంపిన రోజునే మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సమానమైన ఈ సంఘటనలో ఢిల్లీ మరోసారి ఉలిక్కిపడింది.

నిక్కీ యాదవ్ హత్యకు గురైన కారును స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత పోలీసు వర్గాలు తెలిపాయి. అతడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. సాహిల్ ఫార్మా గ్రాడ్యుయేట్ , హత్య జరిగిన రోజే మరో మహిళను పెళ్లి చేసుకోబోయాడు. సాహిల్‌కి మరో మహిళతో నిశ్చితార్థం జరిగిందని, అతనితో నిక్కీ ఈ విషయం మీదే గొడవపడటానికే సాహిల్ ను కలిసిందని ఆలస్యంగా తెలిసింది

నిక్కీ పొరుగువారు ఆమె కనిపించడం లేదని పోలీసులకు తెలియజేశారు. హర్యానాలోని ఝజ్జర్‌లో ఉన్న ఆమె కుటుంబానికి ఆమె ఎక్కడ ఉందో తెలియదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాహిల్‌ను వెతికి పట్టుకున్నారు. మెడికల్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో నిక్కీ, సాహిల్‌లు కలిశారని, కొన్నాళ్లుగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు.
సాహిల్‌కు మరణశిక్ష విధించాలని నిక్కీ ఆమె తండ్రి సునీల్ యాదవ్ డిమాండ్ చేశారు. గతేడాది ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసుతో ఈ ఘటనకు వింత పోలిక ఉంది. శ్రద్ధాను ఆమె లైవ్-ఇన్ భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా హత్య చేశారని, ఆమె మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికి 300 లీటర్ల ఫ్రిజ్‌లో భద్రపరిచి అటవీ ప్రాంతంలో పారవేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంచుమించి ఈ కేసు కూడా అదే విధంగా కనిపిస్తుండటంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.