Delhi : ఫిబ్రవరీ 14 ప్రేమికుల రోజున ప్రజలు ఆవును కౌగిలించుకోవాలన్న ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కౌ హగ్ డే పైన సోషల్ మీడియాలో మీమ్స్ వరదల మధ్య యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రీసెంట్ గా ఓ ప్రెస్ రిలీజ్ లో వాలెంటైన్స్ డే రోజున ఆవును కౌగిలించుకోవడం వల్ల వ్యక్తిగత , సామూహిక ఆనందం లభిస్తుందని ఆవులు మన భారతీయ సంస్కృతికి చిహ్నమని తెలియజేససింది. అయితే మొదట్లో ఇది ఫేక్ న్యూస్ అని భావించినప్పటికీ ఆ తరువాతా మీడియా ఈ విషయాన్ని వెల్లడించడంతో అందరూ అవాకయ్యారు.

ఈ నిర్ణయంపై మీమర్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో రెచ్చిపోయారు. కౌ హగ్ డేను ఉద్దేశిస్తూ అనేక మీమ్స్ వీడియోస్ ను పోస్ట్ చేశారు. దీంతో మత్స్య, పశుసంవర్ధక , పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, ఫిబ్రవరి 14న కౌ హగ్ డే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు బోర్డు కార్యదర్శి ఎస్కె దత్తా ఒక ప్రకటనలో తెలిపారు.

భారతదేశంలోని జంటలు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఈ మధ్యకాలంలో సాధారమైపోయిందని , దీనిని పాశ్చాత్య దిగుమతి సంస్కృతి అని పిలుస్తారు అని, ప్రతి సంవత్సరం లవర్స్ లవర్స్ డే రోజున తీవ్రమైన శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్నారని హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ప్రేమికుల రోజున భారతదేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పురుషుల గుంపులుగా చేరి జంటలు కొట్టబడటం సర్వసాధారణంగా మారిందని అన్నారు.
పశ్చిమ సంస్కృతి యొక్క పురోగతి కారణంగా వేద సంప్రదాయాలు దాదాపుగా అంతరించిపోతున్నాయని పేర్కొన్నారు.