దేవికి తన తండ్రిని నాలుగు రోజుల్లో వెతికిస్తానని మాటిస్తాడు ఆదిత్య. మరోవైపు మాధవ్‌కు బుద్ధి చెప్పాలనుకుంటాడు. ఒకచోట తనని కలిసి మాట్లాడతాడు. ఆ తర్వాత ఆఫీసులో ఉన్న ఆదిత్య.. రుక్మిణికి ఫోన్ చేసి స్కూల్‌కు రమ్మంటాడు. దేవితో కలిసి అక్కడి నుంచి కారులో బయలుదేరుతారు అందరూ. అసలు దేవికి ఆదిత్య ఏం చెప్పనున్నాడు.. అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ఆ తర్వాత ఆగస్టు 15 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
స్కూల్ నుంచి దేవి రాగానే అందరూ కలిసి కారులో వెళ్తారు. తర్వాత సీన్‌లో.. వంట గదిలో ఉన్న భాగ్యమ్మ దగ్గరికి వెళ్తుంది జానకి. ‘నువ్ వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా.. దేవినే ప్రత్యేకంగా చూస్తున్నావ్’ అని ప్రశ్నిస్తుంది జానకి. చిన్న బిడ్డల్ని వేరు చేసి చూసే మనసు నాకు లేదు తల్లి అని బదులిస్తుంది భాగ్యమ్మ. నువ్ పిల్లల్ని వేరుగా చూస్తున్నానని నన్ను అంటున్నావ్ కానీ.. నాకు నీ బిడ్డ మాధవ్ పరాయి బిడ్డని సొంత బిడ్డ లెక్క, సొంత బిడ్డని పరాయి బిడ్డ లెక్క చూస్తున్నట్టు అనిపిస్తుందని చెప్తుంది జానకితో. ఏం చేసినా దేవమ్మా.. దేవమ్మా అంటాడు కానీ చిన్మయిని అడుగుతాడా? అని ప్రశ్నిస్తుంది భాగ్యమ్మ. దేవి అంటే వాడికి అభిమానమని, ఇద్దరిలో ఎవరిని తక్కువ చేయడని బదులిస్తుంది జానకి.
మరోవైపు స్కూల్‌కు వెళ్లిన మాధవ్‌కు దేవి కనబడదు. చిన్మయిని అడగ్గా జరిగిందంతా చెబుతుంది. అది విని షాక్ అవుతాడు. ఇద్దరూ కలిసి దేవిని ఎక్కడికి తీసుకెళ్తారు? అని మనసులో అనుకుంటాడు. కారులో వెళ్తుండగా దేవి ‘అమ్మా.. మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ అని అడగ్గా ఏమోనమ్మా ఆఫీసర్ సారూ యాడికో తీసుకెళ్తున్నాడు అంటుంది రాధ. సారూ అంటూ ఆదిత్యని అడగ్గా.. నువ్ సంతోషపడే చోటుకే వెళ్తున్నాం. రెండు నిమిషాలు ఆగితే నీకే తెలుస్తుంది అంటాడు.
మాధవ్ ఆదిత్య, దేవి, రాధల గురించి బుర్ర బద్ధలయ్యేలా ఆలోచిస్తాడు. నాకు తెలియకుండా పక్కగా ప్లాన్ చేసారన్నమాట. ఇద్దరూ కలవడం మామూలే కానీ దేవిని ఎందుకు తీసుకెళ్లారు. దేవితో అసలు నిజం చెప్తారా? అని టెన్షన్ పడుతుంటాడు మాధవ్. నిజం తెలిస్తే దేవి, రాధ ఇద్దరూ వెళ్లిపోతారు.. అలా జరగనివ్వను అంటూ క్రూరంగా ఆలోచిస్తాడు. ఏం జరిగినా రాధను గడప దాటనివ్వనని అనుకుంటాడు. ఆదిత్య కారుని తీసుకుని ఓ ఆశ్రమం దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఓ లేడి కలవగా.. నేను చెప్పాను కదా. ఈ పాపే అంటాడు తనతో. కాసేపు దేవికి ఆశ్రమం చూపిస్తానని ఆమెతో చెబుతాడు. ‘దేవి ఇక్కడున్న పిల్లలందరినీ ఒకసారి చూద్దాం పద’ అంటూ తీసుకెళ్తాడు ఆదిత్య. ఆశ్రమం అంతా తిరుగుతుండగా దేవికి వేరొక అమ్మాయితో పరిచయం ఏర్పుడుతుంది. దేవి నవ్వుతూ తనతో కలిసి ఆడుకుంటుంది. ఏంటి పెనిమిటిది అని రాధ అడగ్గా.. ఆ మాధవ్ నింపిన విషం ఆ నవ్వులో కరిగిపోనివ్వు అంటాడు. దేవి ఎంత ఆనందంగా ఉందో చూడు అంటాడు.
పిల్లలతో కలిసి స్నాక్స్ తిని ఆదిత్య దగ్గరకు వస్తుంది దేవి. కొత్త ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అడగ్గా.. ‘మంచిగున్నారు. వాళ్లతో ఆడుతుంటే మస్తు ఖుషీగా ఉంది’ అంటుంది దేవి. ఏ ఒక్కరి ముఖంలోనైనా బాధ కనిపించిందా? అని ఆదిత్య అనగా ‘లే అందరూ మస్తు ఖుషీగా ఉన్నారు. మా స్కూల్లో కూడా ఇలా ఉండరు’ అని సంబరపడుతుంది దేవి. ‘అన్నీ ఉండి అందరూ ఉన్నా ఏదో లేదని బాధపడతావ్. ఎవ్వరూ లేకపోయినా వాళ్లే ఒకరికిఒకరై ఎంత ఆనందంగా ఉన్నారో చూడు’ అంటూ చూపిస్తాడు. అదేంటి వాళ్లకి అవ్వా, నాయనా లేరా అంటుంది దేవి బాధగా. ‘ఎవ్వరూ లేని అనాథలమ్మా వాళ్లు. అయినా చూడు ఎంత ఆనందంగా ఉన్నారో. నీకు మీ నాన్న కనిపించలేదని నువ్ బాధపడుతూ మీ అమ్మని బాధపడుతున్నావ్. మరి అమ్మా నాన్న లేని వాళ్లు ఎంత బాధపడాలి చెప్పు. నీకు అమ్మ ఉంది. నాన్న కూడా ఏదో ఒకరోజు వస్తాడు’ అంటూ ఎమోషనల్ అవుతూ చెప్తాడు ఆదిత్య.
అంతలోనే ఒకమ్మాయిని తీసుకుని టీచర్ వాళ్లదగ్గరికి వస్తుంది. సర్ నేను చెప్పింది ఈ పాప గురించే అని చెప్పగా.. ఓ ఈ పాపనేనా.. కంగ్రాట్యులేషన్స్ తల్లి అంటాడు ఆదిత్య. ‘దేవి ఈ పాపెవరో తెలుసా.. ఇక్కడే ఉంటూ జూనియర్ కబడ్డీ జట్టులో స్టేట్ లెవల్లో సెలెక్ట్ అయింది’ అంటూ పరిచయం చేస్తాడు. పాపకు ప్రభుత్వం తరపున ఏ సహాయం కావాలన్నా నేను చేస్తానని హామీ ఇస్తాడు. ఆ తర్వాత దేవికి తండ్రి గురించి అడిగి అమ్మని ఇబ్బంది పెట్టకూడదని హితబోధ చేస్తాడు. అమ్మని బాధపెట్టనని మాటిస్తుంది దేవి. స్వచ్ఛమైన నవ్వు ఎలా ఉంటుందో చూపించడానికి తీసుకొచ్చానని చెప్తాడు ఆదిత్య ఆనందంగా.
సీన్ కట్ చేస్తే.. సత్య కమలని పనిచేయకూడదంటూ అడ్డుకుంటుంది. మరోవైపు మాధవ్ దేవి కోసం పరేషాన్ అవుతుంటాడు. అంతలోనే నవ్వుతూ వస్తుంటారు రుక్మిణి, దేవి. మాధవ్‌ని చూడగానే ‘నాయనా’ అంటూ పరుగెడుతుంది దేవి. ఎక్కడికెళ్లావ్ తల్లి అని మాధవ్ నటిస్తూ అడగ్గా.. ‘ఆఫీసర్ సారూ నన్ను, అమ్మని ఓ చోటుకు తీసుకెళ్లాడు’ అని చెబుతుంది హ్యాపీగా. ఆ మాట విని మాధవ్ నోరెళ్లబెడతాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మాధవ్ దేవి మనసు మార్చడానికి ఇంకేం చేయనున్నాడో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..