• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy for Rtv Media
Thursday, March 23, 2023
  • Login
Rtv Media
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్ 6
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్ 6
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
Rtv Media
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
  • బిగ్ బాస్ 6
  • సినిమా
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
Home Daily Serials

Devatha August 19 episode: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కమల.. చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన రుక్మిణి.. దేవుడమ్మ కంటపడనుందా..?

Savitha S by Savitha S
August 19, 2022
in Daily Serials
0
Devatha August 19 episode: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కమల.. చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన రుక్మిణి.. దేవుడమ్మ కంటపడనుందా..?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

దేవి తన తండ్రి గురించి అడగనని మాటివ్వడంతో మాధవ్ మళ్లీ కొత్త నాటకం మొదలుపెడతాడు. ఆ నాటకంలో ఆదిత్య బలిపశువు అవుతాడు. దేవి ఆలోచన తిరిగి మొదటికొస్తుంది. తండ్రిని వెతికిపెట్టమని ఆదిత్యని వేడుకుంటుంది. దానికి మాధవ్‌పై కోపంతో రగిలిపోతాడు ఆదిత్య. ఆ తర్వాత ఆగస్టు 18 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..

ఆదిత్య అన్న మాటల్ని తలుచుకొని బాధపడుతుంటాడు బాషా. ఏమైందని కమల అడగ్గా.. ‘పటేలు తప్పు చేస్తున్నాడనిపిస్తుంది’ అంటాడు. నేను లేకుండా ఏ పొద్దు బయటికి పోని పటేలు.. ఇప్పుడు నేను వస్తానన్నా తీసుకుపోతలేడని అంటాడు. అలా మాట్లాడకు బాషా అని కమల అనగా.. ‘నేను బాగా సోచాయించే చెప్తున్నా. పటేలు చానా మారిండు. పిల్లలు లేరని పరేషాన్ అవుతున్న పెద్దమ్మ, సత్యలు అమెరికా పోవడానికి అంతా ఏర్పాటు చేశాక కుదరదని చెప్పిండి. సత్యని జరంత జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. లేదంటే జిందగీ ఆగమైపోతది’ అంటూ కమలను అలర్ట్ చేస్తాడు. మరోవైపు ఆదిత్య, రుక్మిణిలు కలుసుకొని దేవి గురించి మాట్లాడుకుంటారు. దేవి మనసులో విషం నింపిన మాధవ్‌ని తిట్టుకుంటారు. ‘మాధవ్ కావాలనే చేస్తున్నాడు. ఒక సమస్య తీరిందంటే ఇంకో సమస్య సృష్టిస్తున్నాడు. రామ్మూర్తి గారి లాంటి మంచి మనిషికి అసలు ఈ మాధవ్ ఎలా పుట్టాడు’ అని అసహ్యించుకుంటాడు ఆదిత్య.

వాళ్ల అమ్మా, నాయనలు బంగారం సారూ. ఆ సారూ ఇలాంటి పనులు చేస్తాడని వాళ్లకు తెలియదు. కానీ ఇప్పుడు ఇలానే చూస్తుంటే మళ్లీ ఏదో కిరికిరి చేస్తాడు అంటుంది రాధ. కొట్టాలంటే కూడా అతని పరిస్థితి చూసి మనసు రావట్లేదంటాడు ఆదిత్య. మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు రుక్మిణి. మళ్లీ మళ్లీ దేవిని బాధపెట్టాలని చూస్తే నేను ఊరుకుంటానా..? అని ఆదిత్య ధైర్యం చెప్తాడు. ‘ఏం చేస్తాం పెనిమిటి. అందరి ముందు మంచిగ ఉంటడు. ఎవరికి తెలియకుండా ఇలాంటి పనులు చేస్తాడు’ అని బాధపడుతూ చెబుతుంది రాధ. అసలు మొదట వాడు ఇలా చేస్తాను అన్నపుడే నువ్ జాగ్రత్త పడితే బాగుండేది అని అనగా బిడ్డని ఇలా బాధపెడతాడని తెలిస్తే నేనెందుకు ఊరుకుంటా పెనిమిటి అంటుంది రాధ. సరే నువేం ఎక్కువ ఆలోచించకు. ఆ మాధవ్‌ని అంత సులువుగా వదిలిపెట్టను. వాడి సంగతి నేను చూసుకుంటాను.. అని మాటిస్తాడు రాధకు. దేవిని ఇంటి దగ్గర ఒక్కదాన్ని వదిలిపెట్టడం మంచిది కాదు. నువ్ ఇంటికి వెళ్లు అని చెప్పి రాధను పంపిస్తాడు ఆదిత్య.

తర్వాత సీన్‌లో కమలకు పురిటి నొప్పులు మొదలవుతాయి. అందరూ కలిసి ఆస్పత్రికి తీసుకెళ్తారు. అందరూ కుతూహలంగా ఎదురు చూస్తుండగా.. కమల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని డాక్టర్ చెప్తారు. దాంతో వారి ఆనందానికి అవధులుండవు. బిడ్డను మురిపంగా చూసుకుంటూ మురిసిపోతుంటారు. దేవుడమ్మ నీ బిడ్డ బంగారంలా ఉందని చెప్తుంది బాషాతో. ఆదిత్య కూడా ఆస్పత్రికి వెళ్లి పాపను చూసి సంబరపడతాడు. ఆ తర్వాత సత్య రుక్మిణికి ఫోన్ చేసి కమలకు బిడ్డ పుట్టిందని చెప్తుంది. ఆ మాట వినగానే రాధ ఖుషీ అయిపోతుంది. ఆస్పత్రికి వెళ్లి చూడాలనుకుంటుంది కానీ అక్కడ అందరూ ఉంటారని ఆగిపోతుంది. భాగ్యమ్మకు నువ్వు ‘అవ్వ‌’వు అయ్యావని చెప్తుంది. నేను దేవమ్మ పుట్టినప్పుడే అవ్వను అయ్యానని హుషారుగా అంటుంది భాగ్యమ్మ. మళ్లీ అవ్వవు అయ్యవని రుక్మిణి చెప్పగా.. అప్పుడు బల్బ్ వెలుగుతుంది. నేను వెంటనే పోయి కమలవ్వని చూసి వస్తానని బయలుదేరుతుంది భాగ్యమ్మ. బిడ్డ పుట్టిందని చెప్పినప్పటి నుంచి నాకూ చూడాలని ఉంది. బిడ్డని ఎత్తుకోవాలని ఉంది. నువ్ ఒక్కదానివే వెళ్తావా అమ్మా.. నేను కూడా వస్తాను.. కానీ ఎలా అంటూ ఆగిపోతుంది రాధ. ‘నువ్ బిడ్డని చూడాలి. అంతే కదా. ఛల్ నువ్ నాతో రా. ఏదైతే అది జరుగుతుంది’ అంటూ రాధని వెంట పెట్టుకుని బయలుదేరుతుంది భాగ్యమ్మ. ఇద్దరూ కలిసి ఆస్పత్రికి వెళ్తారు.

అక్కడ ఆస్పత్రిలో అందరూ పాపని చూస్తూ మురిసిపోతుంటారు. బాషా అయితే బిడ్డని వదిలిపెట్టడు. ‘అమ్మా కమల. రేపు ఇంటికి వెళ్లాక వీడు బిడ్డని ఎవరికీ ఇచ్చేలా లేడు’ అంటూ నవ్వుతుంది దేవుడమ్మ. అంతలోనే ఆస్పత్రికి వెళ్లిన రాధతో ‘అక్క బిడ్డని నువ్ చాటుగా చూడు. అటు వైపు పోదాం పద’ అంటూ తీసుకెళ్తుంది. కిటీకీలో నుంచి బిడ్డను చూసి తెగ ఆనందపడుతుంది రాధ. కమల పక్కన ఉన్న బిడ్డ ఏడుపు వినిపిస్తుంది కానీ రాధకు బిడ్డ కనిపించింది. ఎవరు రాలేదని ఏడుస్తున్నావమ్మా.. అంటూ దేవుడమ్మ, బాషా అంటుంటారు. బిడ్డని దేవుడమ్మ చేతుల్లోకి తీసుకోవడంతో రాధకు బిడ్డ మొహం కనిపిస్తుంది. అది చూసి రాధ మనసులో ‘అత్తమ్మా’ అంటూ ఉహించుకుంటుంది. ‘ఏంటి రుక్మిణి ఇప్పుడా వచ్చేది. చూడూ నువ్ రాలేదని నీ కూతురు ఎలా ఏడుస్తుందో. అదిగో మీ పిన్నమ్మ వచ్చింది ఇప్పుడు సంతోషమా’ అంటూ పాపని రుక్కు చేతుల్లో పెడుతుంది దేవుడమ్మ. చూశారా.. చూశారా.. రుక్మిణిని చూడగానే ఏడుపు ఆపేసింది. ఈ పిల్ల అప్పుడే వాళ్ల చిన్నమ్మ పార్టీలో చేరిపోయినట్టుంది అని దేవుడమ్మ అంటుండంగా.. ఆమె భర్త ‘ ఇంత మంది ఆడిస్తుంటే ఇప్పటిదాకా ఏడ్చి.. ఇప్పుడు వాళ్ల పిన్నమ్మను చూడగానే ఏడుపు ఆపేసింది అంటే అర్థం అదే కదా అంటాడు నవ్వుతూ. అప్పుడు అందరి ముఖాల్లో ఆనందం పొంగిపొర్లుతుంటుంది. ఆ తరువాత కథలో ఏం జరుగుతుంతో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరుకు ఆగాల్సిందే..

Post Views: 81

Tags: devatha august 18 2022devatha serialdevatha serial and episode devatha aug 18 2022devatha serial episodedevatha serial latest episodedevatha serial telugudevatha serial todaydevatha serial today episodedevatha serial today episode full videodevatha serial today episode full video in telugudevatha serial today episode promo
Previous Post

Liger movie : లైగర్ సినిమాకు ఊహించని షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..

Next Post

Janaki kalaganaledu August 19 Episode: జ్ఞానాంబ దగ్గర జానకిని ఇరికించడానికి మల్లిక పన్నాగం.. మన హీరోయిన్‌ ఇమేజీని ఇంకా పెరిగిందిగా..

Next Post
Janaki kalaganaledu August 17: జ్ఞానాంబతో గొడవ.. ఆమె కొడుకుతో జెస్సీ ప్రేమాయణం.. జానకి కథలో ట్విస్టు అదిరిందిగా..

Janaki kalaganaledu August 19 Episode: జ్ఞానాంబ దగ్గర జానకిని ఇరికించడానికి మల్లిక పన్నాగం.. మన హీరోయిన్‌ ఇమేజీని ఇంకా పెరిగిందిగా..

Eesha Rebba: నడుము అందాలు చూపిస్తూ మాయ చేస్తున్న ఈషా

Eesha Rebba: నడుము అందాలు చూపిస్తూ మాయ చేస్తున్న ఈషా

March 21, 2023
Kota Srinivasara Rao: బ్రతికున్న నన్ను చంపేశారు… కోటా ఆవేదన

Kota Srinivasara Rao: బ్రతికున్న నన్ను చంపేశారు… కోటా ఆవేదన

March 21, 2023
Prasanth Kishore: బీజేపీదే మళ్ళీ అధికారం… తేల్చేసిన ప్రశాంత్ కిషోర్

Prasanth Kishore: బీజేపీదే మళ్ళీ అధికారం… తేల్చేసిన ప్రశాంత్ కిషోర్

March 21, 2023
Celebrities Buzz: టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ పాపులర్ లో 9 మంది సౌత్ నుంచే

Celebrities Buzz: టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ పాపులర్ లో 9 మంది సౌత్ నుంచే

March 21, 2023
Taapsee: తాప్సీ అందాల జాతర… ఏ మాత్రం పక్కకి జరిగినా

Taapsee: తాప్సీ అందాల జాతర… ఏ మాత్రం పక్కకి జరిగినా

March 20, 2023
Salaar Movie: ఇండియన్ హాలీవుడ్ మూవీగా సలార్

Salaar Movie: ఇండియన్ హాలీవుడ్ మూవీగా సలార్

March 20, 2023
Sreemukhi: ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రీముఖి

Sreemukhi: ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రీముఖి

March 20, 2023
YS Jagan: స్కిల్ డెవలప్ స్కామ్ పై ఆధారాలు బయట పెట్టిన జగన్

YS Jagan: స్కిల్ డెవలప్ స్కామ్ పై ఆధారాలు బయట పెట్టిన జగన్

March 20, 2023
  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy for Rtv Media

© 2022 RTV Media Telugu News Portal

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్ 6
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News

© 2022 RTV Media Telugu News Portal

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In