మాస్ మహారాజ్ రవితేజ త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వంలో ధమాకా టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి తన కామెడీ టైమింగ్, యాక్షన్ ఎలిమెంట్స్ తో అలరించడానికి రవితేజ రెడీ అయిపోయాడు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే టీజర్ ఎప్పటిలాగే మాస్ మహారాజ్ స్టైల్ గత సినిమాల తరహాలోనే కొన్ని కామెడీ సీన్స్, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్, కొన్ని డైలాగ్స్ తో కట్ చేశారు.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ జీతాన్ని టీజర్ ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో ఆడియన్స్ కాస్తా కొత్తదనం కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో టీజర్ రవితేజ ఫ్యాన్స్ ని తప్ప కామన్ ఆడియన్స్ కి అంత కిక్ ఇచ్చేలా కనిపించడం లేదు. రొటీన్ ఫార్ములా కథతోనే రైటర్ ప్రసన్న కుమార్ ఈ మూవీకి కంటెంట్ అందించినట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక సినిమా టీజర్ వచ్చింది అంటే చాలా హైప్ క్రియేట్ అవుతుంది. ధమాకా టీజర్ విషయంలో అలాంటి హైప్ ఏమీ క్రియేట్ కాలేదు.
ఇక ఈ సినిమా ని డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే రవితేజ ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేపధ్యంలో కంటెంట్ లో ఏ మాత్రం కొత్తదనం ఉన్నా కచ్చితంగా ప్రేక్షకులని మెప్పిస్తుంది. మరి దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన రవితేజకి ఎలాంటి సినిమా ఇచ్చాడు అనేది డిసెంబర్ లో తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే సుదీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమాని రవితేజ చేస్తున్నాడు. పీరియాడిక్ జోనర్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా ఈ మూవీలో రవితేజ కనిపించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.