Dhanbad Fire : మంగళవారం సాయంత్రం ధన్‌బాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో మహిళలు, చిన్నారులు సహా 14 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. విధ్వంసకర అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాప్ని తెలియజేశారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ధన్‌బాద్‌లోని జోరాఫటక్ ప్రాంతంలోని ఆశీర్వాద్ టవర్ వద్ద చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. ధన్‌బాద్‌లోని అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో 14 మంది మరణించగా, 12 మంది గాయపడ్డారు. ధన్‌బాద్‌లో అగ్నిప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందనుంది. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వనున్నారు. అని ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

అంతకుముందు, ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మృతి చెందడం పట్ల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య ప్రస్తుతం 14గా ఉంది.. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు, అని చీఫ్ సెక్రటరీ సుఖ్‌దేవ్ సింగ్ చెప్పారు. మంటలను ఆర్పేందుకు దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయని అధికారులు పేర్కొన్నారు.