కోలీవుడ్ స్టార్ హీరో మొదటిసారిగా స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. వెంకి అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సార్ అనే టైటిల్ తో ద్విభాష చిత్రంగా దీనిని దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు. ఇక సౌత్ లో అన్ని భాషలలో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ధనుష్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వెంకి అట్లూరి దర్శకుడుగా ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలలో లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తే ఈ సారి మాత్రం బలమైన కథతో సందేశాత్మక ఎలిమెంట్ ని టచ్ చేస్తూ ప్రేక్షకులని మెప్పించడానికి రెడీ అవుతున్నాడు.
టీజర్ బట్టి సినిమాలో ధనుష్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా కనిపించబోతున్నాడు. అదే సమయంలో ఇంటర్మీడియట్ విద్యని సాధిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థ విద్యా విధానాన్ని ప్రశ్నించే లెక్చరర్ గా అలరించబోతున్నట్లు అర్ధమవుతుంది. విద్యని అందరికి పంచండి, ఫైవ్ స్టార్ హోటల్ లో డిష్ లా అమ్మకండి అంటూ విలన్ తో చెప్పే డైలాగ్ సినిమా ఇంటెన్షిటిని చూపిస్తుంది. ఇక టీజర్ పరంగా చూసుకుంటే బలమైన కథ, కథనాలతో దర్శకుడు మెప్పించబోతున్నట్లు అర్ధమవుతుంది.
ఇక ధనుష్ కూడా మొదటి సారి ఈ సినిమాలో తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఎప్పటిలాగే తనకి అలవాటైన పెర్ఫార్మెన్స్ తో ధనుష్ టీజర్ కి నిండుతనం తీసుకొచ్చారు. ఇక సినిమాలో విలన్ గా సముద్రఖని కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ధనుష్ కూడా విభిన్న ఆహార్యంలో రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. దీనిని బట్టి కథలో రెండు భిన్న పార్శ్వాలని దర్శకుడు టచ్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది.