Senior Actress Jamuna : ప్రముఖ సినీయర్ నటి జమున (86) ఈరోజు(జనవరి 27, 2023) ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున నెమ్మదిగా కోలుకుంటున్నట్టుగా ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ఇంతలోనే ఆమె తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారు.

అయితే, జమునకి అనారోగ్యం అంటే ఏదో ఆరోగ్య సమస్య అని అందరు భావించారు. కానీ, ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతూ విస్మయానికి గురిచేస్తోంది. జమున గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారట. కానీ, ఈ విషయాన్ని ఎందుకో ఆమె గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆవిడకి చికిత్స చేస్తున్న డాక్టర్లను ఈ విషయం బయటపెట్టొద్దని కండీషన్ పెట్టారట.
Senior Actress Jamuna : కన్నడ కంటే తెలుగులోనే అసాధారణమైన పాపులారిటీ..
మరి ఇందులో వాస్తవం ఎంతవరకూ ఉందో తెలీదు గానీ, మెల్ల మెల్లగా జమున క్యాన్సర్ కారణంగానే మృతి చెందినట్టు వార్త వైరల్ అవుతోంది. ఏదేమైనా ఆమె మృతి సినీ లోకానికి తీరని లోటు అని చెప్పాలి. 200 చిత్రాలకి పైగా నటించిన ఆమె కన్నడ కంటే తెలుగులోనే అసాధారణమైన పాపులారిటీని సంపాదిచుకున్నారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, జగ్గయ్య, గుమ్మడి, సూర్య కాంతం, సావిత్రి లాంటి అగ్ర తారలందరితోనూ తెరను పంచుకున్న ఘనత జమునది కావడం గొప్ప విషయం. ఈనాటికీ సత్యభామ అంటే ఆమెనె ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వస్తారంటే అతిశయోక్తి కాదు.