టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న నలుగురు బడా నిర్మాతలలో అతను కూడా ఒకరు. అలాగే డిస్టిబ్యూటర్ గా కూడా ఉంటూ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో మెజారిటీ థియేటర్స్ దిల్ రాజు చేతిలో ఉన్నాయనే సంగతి అందరికి తెలిసిందే. తన సినిమా రిలీజ్ సమయంలో ఇతర హీరోల చిత్రాలకి థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు అనే అపవాదు దిల్ రాజు మీద ఉంది. అలాగే చిన్న నిర్మాతలని, చిన్న సినిమాలని బ్రతకనివ్వరని కూడా విమర్శలు వినిపిస్తూ ఉంటారు. చాలా మంది చిన్న నిర్మాతలు కూడా చాలా సందర్భాలలో బహిరంగంగానే దిల్ రాజు మీద విమర్శలు చేశారు. అలాగే డిస్టిబ్యూషన్ లో కూడా ఇతరులకి ఇబ్బంది పెడతారని, సినిమాకి హిట్ టాక్ వచ్చిన కూడా కావాలని థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటారని చాలా మంది మీడియాకి ఎక్కి మరీ చెప్పారు.
అయితే ఇదంతా ఎప్పుడు ఇండస్ట్రీలో ఉండేదే అయినా తాజాగాగా కార్తికేయ 2 విషయంలో మరోసారి దిల్ రాజు మీద విమర్శలు వచ్చాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ మూడు సార్లు మార్చుకుంది. థాంక్యూ సినిమా సమయంలో సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన దిల్ రాజు ఫోన్ చేసి అడగడంతో పోస్ట్ ఫోన్ చేశారు. మరల అగస్ట్ 12న రిలీజ్ అనుకున్న మాచర్ల నియోజకవర్గం లాల్ సింగ్ చద్దా సినిమాల కారణంగా ఆగష్టు 13న కార్తికేయ 2 రిలీజ్ చేశారు. అది కూడా చాలా తక్కువ స్క్రీన్స్ లో మూవీ రిలీజ్ అయ్యింది రిలీజ్ తర్వాత సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయినా కూడా దిల్ రాజు కార్తికేయ 2కి థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ ప్రచారం తెరపైకి వచ్చింది.
హిట్ సినిమాని తన స్వార్ధం కోసం చంపేసే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. దీనిపై కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో దిల్ రాజు పాల్గొని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవో వ్యూస్ కోసం ఇష్టానుసారంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. నిఖిల్ తనకి హ్యాపీ డేస్ సినిమా నుంచి తెలుసని, అలాగే నిర్మాతల మధ్య సహ్రుద్బావ వాతావరణం ఉంటుందని, దానిని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దని అన్నారు. ఇండస్ట్రీ మేలు కోరుకునే వ్యక్తినే కానీ నాశనం చేసే వాడిని కాదని, కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, నిజాలు తెలిస్తేనే రాయండి లేదంటే మూసుకొని ఉండండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడంతో చాలా కాలంగా దిల్ రాజు మీద వస్తున్న విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయిందని అందరూ చెప్పుకుంటున్నారు.