సినీ ఇండస్ట్రీలో సెంటిమెట్స్ ఫాలో అవ్వడం కామన్. ఇలానే చాలా హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సూత్రన్నీ ఎప్పుడూ ఫాలో అవుతుంటారు. హీరోహీరోయిన్లను, నటీనటులకు రిపీట్ చేస్తుండటం ఆయన సినిమాల్లో తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం బ్రహ్మానందంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా స్కెచ్ వేశారు.
త్రివిక్రమ్ సినిమా అంటే బ్రహ్మనందం కామెడీ హైలైట్ అవ్వాల్సిందే. జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి” సినిమాల్లో బ్రహ్మి కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. త్రివిక్రమ్ రైటింగ్ స్టైల్‌కి బ్రహ్మి టైమింగ్ సరిగ్గా సూట్ అయ్యింది. దీంతో ఆయా సినిమాల్లో కామెడీ బాంబులు పేలాయి. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ హైలైట్ చేసారు.
ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ సినిమాలో తాను భాగమవుతున్నట్లు కన్ఫర్మ్ చేశారు బ్రహ్మానందం. ఇప్పుడు ఆయన కామెడీ ఎలా ఉండబోతోందనే ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో రూపొందుతున్నది. ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తమన్ బాణీలు కట్టారు.