Discovery : పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 5,000 సంవత్సరాల క్రితం నాటి దక్షిణ ఇరాక్‌లోని ఒక చావడి శిథిలాల కింద అద్భుతమైన ఆవిష్కరణను కనుగొన్నారు. ఈ అన్వేషణ ప్రపంచంలోని ఫస్ట్ సిటీలలో రోజువారీ జీవితం ఎలా ఉండేదో చూపించారు. ఇటీవల, యుఎస్ ఇటాలియన్ బృందం పురాతన ఇరాక్‌లోని సుమేరియన్ నాగరికత యొక్క ప్రారంభ పట్టణ కేంద్రాలలో ఒకటిగా ఇప్పటికే ప్రసిద్ధి చెందిన నగరం నసిరియాకు ఈశాన్యంగా ఉన్న పురాతన లగాష్ శిధిలాలను కనుగొన్నారు. ఇప్పుడు అల్-హిబా అని పిలువబడే ఈ పట్టణం పురావస్తు శాస్త్రవేత్తలకు ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా మారింది. గతంలో ఇక్కడ అనేక చారిత్రక ఆవిష్కరణలు జరిగాయని శాస్త్రవేత్తల అన్వేషణలో ఒక్కో విషయం బయటపడుతోంది. ఈ నగరం యూఫ్రేట్స్ టైగ్రిస్ నదుల మధ్య ఉంది.

శిథిలాల కింద జరిపిన తవ్వకాలలో అప్పటి వారు భోజనం చేసేందుకు కూర్చునే బహిరంగ ప్రదేశాన్ని కనుగొన్నారు. దానితో పాటు బెంచీలు, ఓవెన్ లు, పురాతన ఆహార అవశేషాలతో పాటు 5,000 సంవత్సరాల నాటి మాయిశ్చర్ విక్ స్ట్రక్చర్‌ను కనుగొన్నారు. దీనిని ఇప్పటి గృహ ఉపకారాలతో పరిశీలిస్తూ ఆధునిక ఫ్రిజ్ తో పోల్చవచ్చు. ఆహారాన్ని చల్లగా ఉంచడానికి ఈ బృందం ఈ పరికరాన్ని వినియోగించేవారు అని తెలుస్తోంది. అంతే కాదు శంఖం ఆకారంలో ఉన్న గిన్నెల్లో చేప ముక్కల అవశేషాలను కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు.

ప్రాజెక్ట్ డైరెక్టర్, హోలీ పిట్మాన్ ఈ ప్రదేశంలో శిథిలా కింద జరిపిన తవ్వకాల్లో రిఫ్రిజిరేటర్ని కనుగొన్నామని తెలిపారు. వందల కొద్దీ ప్లేట్లు ఉన్నాయన్నారు. అంతే కాదు ప్రజలు కూర్చునే బెంచీలు , రిఫ్రిజిరేటర్ వెనుక ఒక ఓవెన్ కూడా ఉందని, వారు ఆహారం వండేందుకు దీనిని వినియోగించేవారని పేర్కొన్నారు. అప్పటి వారు బీర్ తాగినట్లు ఆధారాలను కనుగొన్నారు. సుమేరియన్లకు బీర్ చాలా సాధారణ పానీయం, నీటి కంటే కూడా ఎక్కువగా వీటని సేవిస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాంతంలో తవ్విన దేవాలయాలలో ఒకదానిలో బీర్ రెసిపీని కనుగొన్నారు.
