Diwali: దీపావళి అంటేనే నోరు తీపి చేసుకునే సంప్రదాయం మనకు ఉంది. దీపాల వెలుగులతో పాటు ఇంటికి వచ్చిన అతిథులకు నోటినిండా స్వీట్లు పెట్టడం మన సంప్రదాయం. అయితే దీపావళికి మీరు కొన్ని స్వీట్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకండి. అలా మిస్ కాకూడని స్వీట్ల జాబితా ఇక్కడ చూద్దాం.
మైసూర్ పాక్:
ఇండియన్ స్వీట్స్ లో ఎంతో పాపులర్ అయిన మైసూర్ పాక్ ని దీపావళికి తినడం మర్చిపోకండి. ఇది మన సంప్రదాయ తీపి వంటకం. దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కాస్త కష్టమే కాబట్టి స్వీట్ దుకాణాల్లో లభించే మైసూర్ పాక్ ని కాస్త నెయ్యి ఎక్కువగా ఉంటే బాగా ఆస్వాదించడానికి వీలవుతుంది.
గులాబ్ జామూన్:
పండగ ఏదైనా, ఆనందకరమైన సందర్భం ఏదైనా మనకు ముందుగా గుర్తుకు వచ్చే స్వీట్ గులాబ్ జామూన్. అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన ఈ స్వీట్ ని దీపావళి రోజు తినడం మర్చిపోకండి.
కాజు కట్లి:
దీపావళి రోజు నోరూరించే కాజు కట్లిని తినడం అందరూ ఇష్టపడతారు. జీడిపప్పు, పంచదార, యాలకుల పొడి, పాలతో తయారు చేసే దీనిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి దీపావళికి దీనిని తప్పక ట్రై చేయండి.
రస్మలై:
కార్న్ ఫోర్, యాలకులు, కుంకుమ పువ్వుతో తయారు చేసే రస్మలై.. నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది. సంప్రదాయ తీపి వంటకమైన రస్మలైని ఈ దీపావళికి తినడం మర్చిపోకండి.
చావల్ కీ ఖీర్:
సువాసన గల బాస్మతి బియ్యం, చక్కెర, పాలు, జీడిపప్పు, కుంకుమ పువ్వు, బాదంలతో తయారు చేసే చావల్ కీ ఖీర్.. పండగ పూట ట్రై చేయడం మిస్ కాకండి.
Diwali: రాగి కొబ్బరి లడ్డూ:
నోటికి తీపి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి కొబ్బరి లడ్డూని ఈసారి ట్రై చేయండి. తురిమిన కొబ్బరి, రాగి పిండి, వేరుశనగ, బెల్లంతో పాటు టేస్టీ క్రంచ్ లతో తయారు చేసే రాగి కొబ్బరి లడ్డూ నోరూరాల్సిందే.