చిన్న సినిమానే అయినా బాక్సాఫీస్ వద్ద పెద్ద హంగామా నే చేసింది Dj Tillu మూవీ. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు.. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిచారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా కిక్కిచ్చింది. తొలివారం లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల తెచ్చింది. అయితే ఈ సినిమాను త్వరలో ఓటీటీ వేదికపైకి రాబోతుంది.
తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో అతి త్వరలో ఈ సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆహా.. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ‘ఇక టిల్లుగాడి లొల్లి ఆహాలో.. అతి త్వరలో’ అంటూ తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఈ మూవీ ప్రసారం ఎప్పటినుంచి అనేది స్పష్టంగా తెలియలేదు కానీ మార్చి 10 నుంచి ప్రసారమయ్యే అవకాశముంది.
విడుదలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా దాదాపు 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది ఈ సినిమా. మొత్తంగా 4 కోట్లకు పైగా లాభాలతో తెచ్చింది. ఈ మూవీ విజయవంతం కావడంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారట నిర్మాతలు. ఓటీటీలో ఈ సినిమా వస్తుందని తెలియడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటిదాకా థియేటర్స్ దద్దరిల్లాయి ఇక ఇల్లు దద్దరిల్లుబోతుంది అని అంటున్నారు ఆడియన్స్.