డబ్బింగ్ సినిమాల ప్రహసనం మొదలైన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్స్ కి మంచి డిమాండ్ పెరిగింది. పరభాష హీరోలు తెలుగులో ఆడియన్స్ కి భాగా రీచ్ అవ్వడానికి వారికి డబ్బింగ్ చెప్పిన కళాకారుల ప్రతిభ కూడా దాగి ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోలీవుడ్ స్టార్ హీరోలైన సూర్య, విక్రమ్, అజిత్ లాంటి వారితో పాటు మలయాళీ హీరోలైన మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకి భాగా చేరువ కావడానికి వారికి డబ్బింగ్ చెప్పిన శ్రీనివాసమూర్తి కూడా ఒక కారణం. సింగం సిరీస్ లో సూర్య పాత్రకి శ్రీనివాసర మూర్తి డబ్బింగ్ చెప్పాడు. అలాగే సూర్య నటించిన చాలా సినిమాలకి అతనే డబ్బింగ్ చెప్పేవాడు. సినిమాలోని పాత్ర ఇంటెన్సన్ ని అర్ధం చేసుకొని శ్రీనివాసమూర్తి చెప్పిన డబ్బింగ్ సూర్యని తెలుగు ప్రేక్షకులకి భాగా రీచ్ చేసింది.
అలాగే అపరిచితుడు సినిమాలోని విక్రమ్ పెర్ఫార్మెన్స్ ఎంత ఎక్కువగా రీచ్ అయ్యిందో ఆయన చేసిన మూడు పాత్రలకి డబ్బింగ్ చెప్పిన శ్రీనివాసమూర్తి గొంతుక కూడా అంతే ఫేమస్ అయ్యింది. ఇలా కన్నడంతో పాటు ఇతర భాషలకి చెందిన స్టార్ హీరోలు తెలుగు ప్రేక్షకులకి చేరువ కావడానికి శ్రీనివాసమూర్తి డబ్బింగ్ ఎంతో ప్లస్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ గొంతుక మూగబోయింది. చెన్నైలో నివాసం ఉంటున్న శ్రీనివాసమూర్తి గుండెపోటుతో మృతి చెందారు.
ఆయన ఇంట్లోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన చనిపోయినట్లు తెలుస్తుంది. శ్రీనివాసమూర్తి మృతిపై టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకి తీరని లోటని పేర్కొన్నారు. ట్విట్టర్ లో కూడా ఈయన మృతిపై సూర్య, విక్రమ్ అభిమానులు సంతాపం తెలియజేశారు. శ్రీనివాసమూర్తి మరణం తెలుగు సినిమా కంటే తమిళ హీరోలకి తీరని లోటని పేర్కొంటూ కామెంట్స్ చేస్తున్నారు.