మలయాళీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడుగా తెరంగేట్రం చేసిన అతి కొద్ది కాలంలోనే నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. రెగ్యులర్ గా ఒకే తరహాలో కథలు చేయకుండా, మాస్ హీరో అనిపించుకోవాలని ఆలోచన లేకుండా డిఫరెంట్ కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు చేరువవుతున్నాడు. మొన్నటి వరకు మలయాళీ నటుడు గానే ఉన్న దుల్కర్ మెల్ల మెల్లగా తనను తాను పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే తమిళ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. అలాగే బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాడు. ప్రస్తుతం తెలుగులో సత్తా చాట ప్రయత్నం చేస్తున్నాడు.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం సినిమాతో దుల్కర్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న జెమినీ గణేషన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం కీర్తి సురేష్ సొంతం చేసుకున్న దుల్కర్ పాత్రకి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా సీతారామం సినిమాతో సోలోగా దుల్కర్ టాలీవుడ్లో బ్లాక్ బాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని అన్ని వర్గాల ప్రేక్షకులు చేరువైంది. ప్రేమ కథలో సరికొత్తగా ఎమోషనల్ ఎలిమెంట్ ని ఆవిష్కరించి దర్శకుడు హను రాఘవపూడి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాడు. దీంతో ప్రేమ కథలను ఇష్టపడే అందరూ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. చాలా రోజుల నుంచి మంచి ప్రేమ కథ చిత్రం చూడాలనుకుంటున్న వారికి సీతారామం ఓ టానిక్ లా దొరికింది.
ఇక సినిమాలో రామ్ పాత్రలో నటించిన దుల్కర్ కి కూడా తెలుగు ప్రేక్షకులు ఫ్యాన్స్ గా మారిపోయారు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. దీంతో టాలీవుడ్ లో 50 కోట్ల క్లబ్లో చేరిన మొదటి మలయాళీ హీరోగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో యంగ్ స్టార్ గా ఉన్న హీరోలకు సాధ్యం కానీ క్రెడిట్ ని దుల్కర్ సీత రామం సినిమాతో సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో దుల్కర్ కి జోడిగా నటించిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. అలాగే రష్మిక మందన కూడా కాశ్మీరీ ముస్లిం అమ్మాయిగా కీలకపాత్రలో కనిపించి మెప్పించింది. గ్లామర్ పాత్రలో చేసే రష్మిక మందనకి తను తాను పోర్ట్రైట్ చేసుకోవడానికి అవకాశం ఈ సినిమా ఇచ్చిందని చెప్పాలి. మొత్తానికి దుల్కర్ సల్మాన్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువై టాలీవుడ్ హీరోల సరసన చేరిపోయాడు. ఇకపై అతను నటించబోయే సినిమాలు కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి తెలుగులో దుర్కర్ హీరోగా నెక్స్ట్ సినిమా చేయబోయే దర్శకులు ఎవరనేది చూడాలి.