AP Politics: ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలు పదేపదే చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికల కోసమే తమ క్యాడర్ ను సిద్ధం చేస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇక జనసేన పార్టీ కూడా ముందస్తు ఎన్నికలు వచ్చిన తాము సిద్ధంగా ఉన్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అయితే అధికార పార్టీ వైసిపి మాత్రం ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి ఎక్కువగా నష్టం జరిగే అవకాశం అనే విషయంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అధికార పార్టీ వైసిపికి ముందస్తు ఎన్నికలకు వచ్చినా కూడా అన్ని నియోజకవర్గాలకు తమ పార్టీ నుంచి అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఉన్నారు.
అలాగే ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్ పాలనపై ప్రజలలో కూడా సంతృప్తికరమైన అభిప్రాయం ఉంది. ఇది కచ్చితంగా అధికార పార్టీకి లాబించే అంశం అని చెప్పాలి. ఇక జనసేన పార్టీ చూసుకుంటే సంస్థగతంగానే సరైన నాయకత్వం లేదు. నియోజకవర్గాలలో కూడా బలంగా నిలబడే అభ్యర్థులు ఆ పార్టీకి లేకపోవడం గమనార్హం. గట్టిగా చూసుకున్న 30 నుంచి 40 నియోజకవర్గాల వరకు మాత్రమే జనసేనకి కొద్దో గొప్పో పోటీ ఇచ్చే స్థాయిలో అభ్యర్థులు ఉన్నారు.
అయితే పార్టీని నియోజకవర్గాలలో ముందుండి నడిపించే బలం ఆ నాయకులకు లేదనే మాట వినిపిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా కూడా ప్రజల్లో చంద్రబాబు పరిపాలనపై అసంతృప్తిగానే ఉంది అని చెప్పాలి. అలాగే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ను చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నారా లోకేష్ నాయకత్వ శూన్యం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా నిలబడే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది.