Earth Quake : ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌తో పాటు అవసరమైన పరికరాలు , వైద్య సామాగ్రి, అధునాతన డ్రిల్లింగ్ యంత్రాలు, భూకంప సహాయ ప్రయత్నాలకు అవసరమైన ఇతర కీలకమైన సాధనాలతో సహా, సెర్చింగ్, రెస్క్యూ ఆపరేషన్ కోసం భరత్ కు చెందిన NDRF సిబ్బంది బృందం టర్కీకి బయలుదేరింది.

సోమవారం టర్కీ కి అవసరమైన సహాయం అందిస్తామని భారత ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో భూలోకంపై బాధితుల సహాయం నిమిత్తం NDRF సిబ్బంది బృందం టర్కీకి బయలుదేరింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు 4,800 మందికి పైగా ప్రజలు మరణించారు. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ క్రమంలో భారతీయ వైమానిక దళ విమానంలో మొదటి బ్యాచ్ సహాయ సామగ్రిని భరత్ టర్కీకి పంపింది.
ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది బృందం ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌తో పాటు అవసరమైన పరికరాలతో సహాయ ప్రయత్నాల కోసం, శోధన , రెస్క్యూ కార్యకలాపాల కోసం టర్కీకి బయలుదేరారు.

NDRF సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లతో పాటుగా టర్కీకి 1వ బ్యాచ్ భూకంప సహాయ సామగ్రి బయలుదేరింది, ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, వైద్య సామాగ్రి, డ్రిల్లింగ్ మెషీన్లు ఇతర అవసరమైన పరికరాలు పంపించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.భారతదేశంలోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ భారత ప్రభుత్వం సహాయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అన్నారు.

టర్కీ సిరియాలో నిరాశ్రయులైన వేలాది మంది రాత్రి చలిలో ఆపసోపాలు పడుతున్నారు. భూకంప కేంద్రం నుండి 33 కి.మీ దూరంలో ఉన్న టర్కీ నగరమైన గాజియాంటెప్‌లో, ప్రజలు షాపింగ్ మాల్స్, స్టేడియాలు, మసీదులు , కమ్యూనిటీ సెంటర్లలో ఆశ్రయం పొందారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు.