Earth Quake : భారీ భూకంపం టర్కీ, సిరియాలను వణికిస్తోంది. మృతుల గోషతో ఆ ప్రాంతం తల్లడిల్లుతోంది. భూకంపంలో మరణించిన వారి సంఖ్య 4,800 కంటే ఎక్కువ గా నమోదు అయ్యిందని రాయిటర్స్ నివేదించింది.

సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం టర్కీ, సిరియా ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లను నేలమట్టం చేసింది. ఆసుపత్రులను ధ్వంసం చేసింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య వేలల్లో నమోదు అవుతోంది. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు , నిరాశ్రయులయ్యారు.

టర్కీ, సిరియాలో రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గడ్డకట్టే శీతాకాల వాతావరణం రాత్రిపూట ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ ప్రయత్నాలకు ఆటంకం కలిగించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి దగ్గరగా పడిపోయాయి, శిథిలాల కింద చిక్కుకున్న, నిరాశ్రయులైన వ్యక్తుల పరిస్థితి మరింత దిగజారిందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.

2021 ఆగస్టులో రిమోట్ సౌత్ అట్లాంటిక్‌లో సంభవించిన ప్రకంపనల తర్వాత US జియోలాజికల్ సర్వే ద్వారా ప్రపంచవ్యాప్తంగా నమోదైన అతిపెద్ద భూకంపం ఇది.