వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగంలో ఉన్నవారు కూడా ప్రశాంతంగా లేరనే మాట పదే పదే వినిపిస్తుంది. వైసీపీ నాయకులు సంక్షేమ పథకాల గురించి ఊదరగొట్టడం తప్పితే అభివృద్ధి, ప్రజల కనీస అవసరాలని గుర్తించి వాటిని తీర్చే ప్రయత్నం చేయడం లేదనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ అమలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ మూడేళ్ళు అవుతున్న కూడా దానిపై ఎలాంటి కార్యాచరణ చేయలేదు. అలాగే ఉద్యోగులు దాచుకున్న సొమ్ముని కూడా ఖాళీ చేసి తన సంక్షేమ పథకాల కోసం వాడేసుకున్నారు. అయితే ఈ డబ్బులని తిరిగి జమ చేయాలని ఉద్యోగులు పదే పదే అడుగుతున్నా కూడా వైసీపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.
అలాగే ప్రైవేట్ కంపెనీల కంటే దారుణంగా జీతాలని విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే నెల ఆఖరుకి లేదంటే ఒకటో తేదీకి జీతం పడిపోతుంది అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తేదీన జీతాలు చూస్తున్న ఉద్యోగులు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతి నెల కనీసం 10 నుంచి 15 రోజులు ఆలస్యంగా జీతాలు ఉద్యోగుల ఖాతాలలో పడుతున్నాయి. ఒక్కోసారి జీతాలు పడటం లేదు కూడా. దీనిపై ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు ప్రశ్నించిన అస్సలు పట్టించుకోవడం లేదు. ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి తమ జీతాలపై ఆందోళనలు చేసినా కూడా వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు.
ఈ జనవరిలో కూడా సంక్రాంతి వరకు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పడలేదు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులని వైసీపీ సర్కార్ అన్ని రకాలుగా ఇబ్బందులకి గురి చేస్తుంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ ని కలిసారు. తమ గోడుని గవర్నర్ తో చెప్పుకున్నారు. ఉద్యోగులు దాచుకున్న 27 కోట్ల రూపాయిలని ప్రభుత్వం వాడేసుకుందని, దీనిపై ఎన్నిసార్లు అడిగిన స్పందించడం లేదని గవర్నర్ కి తెలియజేశారు. అలాగే జీతాలు కూడా సమయానికి వేయడం లేదని తెలిపారు. గవర్నర్ ఈ విషయంలో కలుగజేసుకొని తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించుకున్నారు.