Engagement : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి, రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం అయ్యింది. ముంబయిలోని ఆంటిలియాలో సంప్రదాయబద్ధంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్. 2019లో అనంత్, రాధికలు పెళ్లి చేసుకోనున్నట్లు కుటుంబీకులు ప్రకటించారు.

గుజరాతీ హిందూ కుటుంబాలలో తరతరాలుగా అనుసరిస్తున్న గోల్ ధన , చునారి విధి వంటి పురాతన సంప్రదాయాలు కుటుంబ దేవాలయంలో ఎంతో ఉత్సాహంతో నిర్వహిస్తున్నామని అంబానీలు ఒక ప్రకటనలో తెలిపారు. గోల్ ధన, అంటే బెల్లం , ధనియాలు, గుజరాతీలలో వివాహానికి ముందు జరిగే వేడుక ఇది. ఈవెంట్ జరిగే వరుడి స్థలంలో ఈ వస్తువులు పంపిణీని చేస్తారు పెళ్లివారు. వధువు కుటుంబ సభ్యులు బహుమతులు , స్వీట్లతో వరుడి ఇంటికి వస్తారు, ఆపై జంట ఉంగరాలు మార్చుకుంటారు.

ఇలాంటి సంప్రదాయాన్నే అంబానీలు ఫాలో అయ్యారు. గతంలో అంబానీ పెద్దకొడుకు , కూతురు పెళ్లి వేడుకల్లోనూ ఇలాంటి సంప్రదాయాన్నే అనుసరించారు. వీరు వారి ట్రెడిషన్‌కు ఎప్పుడూ పెద్దపీటవేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక సాయంత్రం వేడుకలు అంబానీ ఇంట్లో ఆంటిలియాలో ఘనంగా జరిగాయి. అనంత్ సోదరి ఇషా అంబానీ , రాధిక తన కుటుంబసభ్యులను కార్యక్రమాలకు ఆహ్వానించడానికి మర్చంట్ ఇంటికి వెళ్ళారు. ఈ వేడుక కోసం రాధిక మర్చంట్ గోల్డెన్ లెహంగా ధరించగా, అనంత్ అంబానీ నీలం రంగు దుస్తులను ఎంచుకున్నాడు.

నిశ్చితార్థ వేడుకలో, అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ తన అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. ఇక స్టార్స్ , సెలబ్రిటీలు ఈ కొత్త జంటను ఆశీర్వదించేందుకు ఆంటిలియాలకు క్యూ కట్టారు. తారల తళుకులతో ఈ ఎంగేజ్మెంట్ వేడుక మరింత కలర్ఫుల్గా మారింది.

రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలలో చిన్నవాడైన అనంత్ అంబానీ కంపెనీ కొత్త ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహించనున్నాడు. గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంపొందించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆశయంలో రిలయన్స్ అగ్రగామిగా ఉండేందుకు పోటీపడుతోంది ఈ కంపెనీ.