Esha Gupta : ఫ్యాషన్ రంగంలో ట్రెండ్ ను సెట్ చేయడానికి బాలీవుడ్ తారలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. వీరు అందించే స్టైల్ స్టేట్మెంట్లను ఫ్యాషన్ లవర్స్ అమితంగా ఇష్టపడతారు. సందర్భానుసారంగా తమ ఫ్యాషన్ లక్ష్యాలను మారుస్తూ హాట్ లుక్స్‌తో ఫ్యాన్స్ ను కట్టిపడేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్ ఈషా గుప్తా తన రూపానికి తగ్గట్లుగా స్టైలిష్ డ్రెస్‌ను ధరించి ఫ్యాషన్ ఐకాన్ గా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. రీసెంట్గా ఈ చిన్నది స్ట్రాప్‌లెస్ మిడ్నైట్ బ్లూ గౌను ధరించి హాట్ ఫోటో షూట్ చేసి ఈ పిక్స్‌ను తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఈషా గుప్తా ఫ్యషన్ డిజైనర్ ద్వయం శాంతను నిఖిల్‌లకు మ్యూజ్‌గా వ్యవహరించింది. గార్జియస్ ఫ్లోర్-స్లీపింగ్ అవుట్‌ఫిట్‌లో అదిరిపోయింది ఈషా. స్ట్రాప్‌లెస్ కార్సెట్ బాడీస్ ,బోల్డ్ స్లిట్తో వచ్చిన గౌను ఈషా ఫిగర్‌కు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఈషా ఒంపులను, వయ్యారాలను స్పష్టంగా చూపించింది ఈ అవుట్‌ఫిట్.

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మినిమల్ ఉపకరణాలను ఎన్నుకుంది ఈషా. చెవులకు మినిమల్ డ్రాప్ చెవిపోగులు పెట్టుకుంది. పాదాలకు ఒక జత స్పార్క్లీ పాయింటెడ్ హీల్స్ వేసుకుంది. తన కురులతో మెస్సీ హెయ్స్టైల్ వేసుకుని అందరినీ మెస్మరైజ్ చేసింది.

మేకప్ కోసం ఈ బ్యూటీ నులకు బ్లాక్ ఐ లైనర్, మస్కరా వేసుకుని పెదాలకు బ్రౌన్ లిప్ గ్లాస్‌ను దిద్దుకుని హైలైట్ చేసి తన సిగ్నేచర్ గ్లామ్ మేకప్ లుక్‌తో మరోసారి ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసింది ఈ చిన్నది.

ఈషా ఇలా ఫ్యాషన్ తో ప్రయోగాలు చేయడం కొత్తేమి కాదు. ఈ చిన్నది తరచుగా అదిరిపోయే యూనిక్ అవుట్ ఫిట్స్‌లో దర్శనమిస్తూ అభిమానుల మనసు దోచేస్తుంది. సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ స్టార్ కు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు ఎప్పుడు పోస్ట్‌లను షేర్ చేస్తుందా అని ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. అందుకే వారిని ఉత్సాహపరిచేందుకే ఈషా ఇలా నిషా ఎక్కించే అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చి తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటుంది.