ప్రభాస్ పౌరాణిక ఇతిహాస డ్రామా ఆదిపురుష్ మూవీ జూన్ 16న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. హిందూ ఇతిహాసమైన రామాయణం ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామాపై అనూహ్యంగా అంచనాలు పెరిగాయి. ట్రైలర్ కు ముందు కాస్త సాధారణంగా కనిపించినా .. ట్రైలర్ తర్వాత ఓవర్ నైట్ పరిస్థితి మారిపోయింది. రికార్డ్ సంఖ్యలో వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్ తర్వాత సినిమాపై ఉన్న నెగటివిటీ మొత్తం పోయింది.
ఇక ఆదిపురుష్ చుట్టూ మిగిలి ఉన్నది మాస్ హైప్ మాత్రమే. లార్డ్ శ్రీరాముడిగా ప్రభాస్ ప్రెజెంటేషన్ అట్ట్రాక్టీవ్ గా పనిచేసింది. ట్రైలర్‌లో అతని అద్భుతమైన లుక్ సినిమా మొత్తం మీద పాజిటివ్ ఇంప్రెషన్‌ను క్రియేట్ చేసింది.
ఆదిపురుష్ ట్రైలర్..
VFX మరియు CGI నాణ్యత చాలా వరకు అప్‌గ్రేడ్ చేయబడింది. ఆ క్వాలిటీ ట్రైలర్ లోనే తెలియడంతో బిగ్ స్క్రీన్ పై ఆడియన్స్ కి అద్భుతమని ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మొత్తంగా మొన్నటి వరకు ఒక లెక్క ట్రైలర్ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా మారిపోయి ఇప్పుడు ఆదిపురుష్ మోస్ట్ అవైటెడ్ మూవీ గా మారింది. ఆ అంచనాలను అందుకోవడానికి జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోంతోంది ఈ ఎపిక్ స్టోరీ.