తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. రాజమౌళి, కొరటాల తర్వాత చేసిన అన్ని సినిమాలతోనూ విజయాలు అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈయన చేసే సినిమాలపై కూడా అంచనాలు భారీగా ఉంటాయి. తాజాగా అనిల్ ఎఫ్ 3 సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈయన ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు.
వరసగా ఐదు విజయాల సాధించిన తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు అనిల్. ఈ సినిమా షూటింగ్ కుడా పూర్తయింది. హైదరాబాద్‌లోనే కీలకమైన సన్నివేశాలు అన్నీ చిత్రీకరించారు. ఎఫ్ 2 కంటే ఎక్కువ ఫన్ అండ్ కామెడీ ఎఫ్ 3 సినిమాలో ఉంటుందని నమ్మకంగా చెప్తున్నాడు దర్శకుడు. తెలుగు ఇండస్ట్రీకి సీక్వెల్స్ అంతగా కలిసిరావు అనే సెంటిమెంట్ కూడా ఉంది. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన బంగార్రాజు ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది.
సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సంక్రాంతికి వచ్చి విజయం సాధించింది. దాంతో ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వెంకటేష్, వరుణ్ తేజ్ సహా చాలా మంది నటులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాను ముందు ఫిబ్రవరి 25న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించారు. కానీ అదే రోజు భీమ్లా నాయక్ సినిమా విడుదల కానుందని అప్పట్లో ప్రకటన రావడంతో ఎఫ్ 3ని ఎప్రిల్ 28కి వాయిదా వేసారు. కానీ ఎప్రిల్ 29న ఆచార్య విడుదల చేస్తున్నారు.
దాంతో ఇప్పుడు మరోసారి ఎఫ్ 3 రిలీజ్ డేట్ ని వాయిదా వేసారు. తాజాగా ఈ సినిమాను మే 27న సినిమా విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించగా దానికి తగ్గట్లుగానే ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మొదటి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఫన్ ఉంటుందని.. పొట్టలు చెక్కలవ్వడం ఖాయం అంటున్నాడు దర్శకుడు.
ముందు అనుకున్న దానికంటే స్క్రిప్ట్ ఇంకా చాలా అద్భుతంగా వచ్చిందని.. లాక్ డౌన్ కావడంతో ఇంటి దగ్గరే కూర్చుని మరింత పక్కా స్క్రీన్ ప్లే రాసుకున్నామంటున్నాడు అనిల్. ఇదిలా ఉంటే తాజాగా ఎఫ్ 3 కథ ఇదేనంటూ నెట్ లో ఓ స్టోరీ చక్కర్లు కొడుతుంది. ఎఫ్ 2 లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్స్ మీదే వెళ్లాడు అనిల్. కానీ మూడో భాగం మాత్రం డబ్బులతో వచ్చే సమస్యల చుట్టూ కథను అల్లుకున్నాడు.
ఇదే విషయాన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు మొన్న విడుదలైన పాటలోనూ ఖరారు చేసాడు ఈ దర్శకుడు. కథ డబ్బుల చుట్టూనే తిరుగుతుంది. ఎఫ్ 2లో భార్యల వల్ల భర్తలకు ఉండే ఫ్రస్టేషన్ కనిపిస్తుంది. ఇక్కడ భార్యలు చేసే పనులతో భర్తలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే కాన్సెప్టుతో ఎఫ్ 3 రానుందని సమాచారం. భార్యల మితిమీరిన అధిక ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఓ హోటల్ పెడతారు.
అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యల వల్ల వారు పడే పాట్లే ఈ సినిమా కధ. అప్పులు తీర్చడానికి పడే తిప్పలను ఎంతో ఫన్నీగా చూపించబోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇదే మెయిన్ పాయింట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం మే 27 వరకు వేచిచుడాల్సిందే.