బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ షోకి సంబందించిన ప్రోమోలు స్టార్ మా ప్రచారం చేయడం మొదలు పెట్టింది. దీంతో ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయే కంటిస్టెంట్ ల గురించి జోరుగా చర్చ నడుస్తుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా టీవీ, సినిమా రంగాలకి చెందిన యాక్టర్స్, టెక్నీషియన్స్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ని కూడా తీసుకుంటున్నారు. అలాగే ఇతర రంగాలలో రాణిస్తున్న వారిని కూడా ఎంపిక చేశారనే సమాచారం వినిపిస్తుంది.
ఇక సీనియర్ యాంకర్ ఉదయభాను ఈ సారి హౌస్ లోకి వెళ్లడం పక్కా అనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సెలబ్రెటీ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ వినిపిస్తుంది. యాక్టర్ సుదీప అంటే వెంటనే ఎవరు గుర్తు పట్టలేరు కానీ విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించి కామెడీ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్, అలాగే మనసంతా నువ్వేలో ఉదయ్ కిరణ్ చెల్లిగా నటించిన బాలనటి అంటే అందరూ గుర్తు పడతారు. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తరువాత హీరోయిన్ గా ప్రతిఘటన అనే సీరియల్ లో నటించింది.
తరువాత పెళ్లి చేసుకొని టీవీ, సినిమాలకి పూర్తిగా దూరం అయ్యింది. ప్రస్తుతం ఫామిలీ లైఫ్ మెయింటేన్ చేస్తుంది. ఇప్పుడు ఈమెని బిగ్ బాస్ కోసం ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఈమె కూడా హౌస్ లోకి రావడానికి జెండా ఊపినట్లు బోగట్టా. నటిగా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టాలని సుదీప భావిస్తుందని తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ఫేమ్ తెచ్చుకొని లైమ్ లైట్ లోకి రావాలని అనుకుంటున్నట్లు బోగట్టా. ఈమెకి రెమ్యునరేషన్ కూడా బిగ్ బాస్ యాజమాన్యం గట్టిగానే ఇస్తున్నట్లు సమాచారం.