fan war : హీరోలంతా బాగానే ఉంటారు.. కానీ ఫ్యాన్స్ కొట్టుకుంటారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో హీరోలు వెల్లడించారు కూడా. అయినా సరే.. తగ్గేదేలే.. అవకాశం వచ్చిందంటే చాలు.. రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా కొట్టుకోవడం. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ మంచి సక్సెస్‌ను సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అటు.. మెగా.. ఇటు నందమూరి అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’ ఫ్లాప్‌ను గుర్తు చేసేలా #megastarkalyanram అనే హ్యాష్ ట్యాగ్‌ను నందమూరి అభిమానులు వైరల్ చేస్తున్నారు.
ఈ హ్యాష్ ట్యాగనప్ నిన్నటి నుంచి ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. కళ్యాణ్ రామ్ సక్సెస్‌ను నందమూరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూనే.. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. బింబిసార సక్సెస్ అయిన సంబరం కంటే.. ఆచార్య ఫ్లాపును ఎక్కువగా మెగా అభిమానులకు గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. ఆచార్యతో బింబిసారను పోల్చుతూ నందమూరి అభిమానులు ట్విట్టర్‌లో హంగామా చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఒక్క హిట్‌కే ఇంత రచ్చ ఏంటని మండిపడుతున్నారు.
fan war : మీ కెరీర్‌లో ఇన్ని డిజాస్టర్లు ఉన్నాయో చూడండి..
బింబిసార హిట్ అయిందనే సంబరపడితే తప్పు లేదు కానీ పక్క వారి సినిమాలు పోయాయని ఇలా ఎగతాళి చేయడం కరెక్ట్ కాదంటూ కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే గతంలో కళ్యాణ్ రామ్, బాలకృష్ణల ఫ్లాప్ సినిమాల లిస్ట్‌ను తీసి మరీ వైరల్ చేస్తున్నారు. మీ కెరీర్‌లో ఇన్ని డిజాస్టర్లు ఉన్నాయో చూడండంటూ గేలి చేస్తున్నారు. మొత్తానికి బింబిసార సక్సెస్ మాత్రం నందమూరి అభిమానులు, మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేసింది. సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చకు దారి తీసింది. చివరకు ఈ ఫ్యాన్ వార్ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.