Akira Nandan: మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉందా అంటే చెప్పలేం కాని ఫ్యాన్స్ మాత్రం బలంగా కోరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా నందన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు. అతను ఆటిట్యూడ్, వాకింగ్ స్టైల్ , మేనరిజమ్ అచ్చంగా పవన్ కళ్యాణ్ తరహాలోనే ఉండటంతో అతనిని జూనియర్ పవర్ స్టార్ గా అప్పుడే ప్రచారం చేస్తున్నారు. యుక్తవయస్సులోకి వచ్చిన అకిరా నందన్ తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా-ఈ రేసింగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఈ ఈవెంట్ చూడటానికి అకిరా నందన్ రావడం ఒకే కాని, అతని లుక్స్, హైట్, పెర్సనాలిటీ చూసిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి టైం వచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అకిరా నందన్ ని హీరోగా టాలీవుడ్ కి పరిచయం చేయాలని సోషల్ మీడియాలో అతని ఫోటోని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారసుడిగా అతన్ని వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ సపోర్ట్, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండటంతో అకిరా నందన్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం కష్టం కాకపోవచ్చు కాని ఎలా నిలబడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అకిరా నందన్ కి సినిమాలోకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ అయితే ప్రస్తుతానికి లేదని, అతని ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయని గతంలో రేణు దేశాయ్ చెప్పారు.
తండ్రి తరహాలోనే తన ఐడియాలజీ ఉంటుందని రేణు పేర్కొంది. పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడని తెలిపింది. పవన్ కళ్యాణ్, అకిరా నందన్ కూర్చున్నప్పుడు ఎక్కువగా వారి మధ్య పుస్తకాల గురించి చర్చ నడుస్తుంది అని తెలిపింది. అయితే ఈ మధ్య కాలంలో అకిరా నందన్ పవన్ కళ్యాణ్ తో పాటు ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతన్ని హీరోగా చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతూ ఉన్నారు. అమరి అది సాధ్యం అవుతుందో, లేదో వేచి చూడాలి.