విజయ్ దేవరకొండ క్రేజ్ ప్రస్తుతం ఒక రేజ్ లో ఉందని చెప్పాలి. లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా తనని తాను ఈ రౌడీ స్టార్ ఎస్టాబ్లిష్ చేసుకునే చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాతో ఇండియన్ వైడ్ గా తన మార్క్ ని పరిచయం చేయడంతో పాటు తనని తాను యూనివర్శల్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. వీరిద్దరి కలయికలో యాక్షన్ ఎంటర్టైనర్ గా లైగర్ మూవీ తెరకెక్కింది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 25న రిలీజ్ కాబోతుంది. ఇక బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడంతో నార్త్ ఇండియాలో గట్టిగానే సినిమానే ప్రమోట్ చేస్తున్నారు.
పూరి, రౌడీ విజయ్ కలయిక కావడంతో తెలుగులో ఎలాగూ హైప్ ఉంటుంది. ఈ కారణంగానే తెలుగు ప్రమోషన్ పక్కన పెట్టి ముంబై, నార్త్ ఇండియాలో ప్రమోషన్ మీద విజయ్ దేవరకొండ, అనన్యా పాండే ద్రుష్టి పెట్టారు. ఈ నేపధ్యంలో రీసెంట్ గా ముంబై మెట్రో ట్రైన్ లో జర్నీ చేస్తూ అక్కడ ప్రయాణికులతో ముచ్చటించారు. ఇక తాజాగా ఓ షాపింగ్ మాల్ లో సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా పార్టిసిపేట్ చేశారు.అయితే అక్కడ దేవరకొండని చూసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో అక్కడ సెక్యూరిటీకి కూడా వారిని కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. షాపింగ్ మాల్ మొత్తం కిక్కిరిసిపోయింది.
దీంతో గాలి వేయక విజయ్ దేవరకొండ, అనన్యా కొద్ది సేపు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో ఈవెంట్ పూర్తి కాకుండానే అర్ధంతరంగా అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ షోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ క్రేజ్ ముంబై మహానగరాన్ని కూడా షేక్ చేసింది అని, తెలుగు వ్యక్తిగా అతని క్రేజ్ చూసి ప్రతి ఒక్కరి గర్వపడాలని గొప్పగా కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండకి అక్కడ వస్తున్న స్పందన చూస్తూ ఉంటే లైగర్ సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతుంది.