Flash News – Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నారా లోకేష్ పాదయాత్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో పాటుగా ఉన్న తారకరత్న కూడా మసీదులోకి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనలు ముగించుకొని బయటకు రాగానే సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయనను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రికి వచ్చినప్పటికే తారకరత్నకి పల్స్ లేదని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించబోతున్నట్టు సమాచారం. నేటి ఉదయం నుంచి కుప్పంలో నారా లోకేష్‌తో ఆయన కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం కుప్పంలో ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్పృహతప్పి పడిపోవడంతో. హుటాహుటిన కుప్పం కేసీ ఆస్పత్రికి తారకరత్నను తరలించారు.
Flash News – Nandamuri Tarakaratna: తారకరత్నను పరామర్శించిన నందమూరి బాలకృష్ణ..
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అత్యవసరమైతే మెరుగైన వైద్యంకోసం బెంగళూరుకు తరలించే అవకాశం ఉందట. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే నందమూరి బాలకృష్ణ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. తారకరత్నను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. నారా లోకేష్ లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు.