ప్రేమికులు ప్రయాణ సమయాలలో కూడా గంటల తరబడి చాటింగ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. ఒక్కో సారి చాటింగ్ లో వారి మాటలు శృతి మించి ఉంటాయి. ఆ సంభాషణలు ఎవరైనా అనుకోకుండా చూస్తే ఒక పట్టాన అర్ధం కాదు. లేదంటే ఒకదానికి ఒకటి అర్ధం అవుతుంది. అర్ధం కాకుంటే సమస్య ఏమీ ఉండదు కానీ తప్పుగా అర్ధం అయితే మాత్రం అనుకోని ఇబందులు ఎదురవుతాయి. ఇప్పడు అలాంటి సంఘటన ఒకటి మంగళూరులో సంచలనంగా మారింది. ఆరు గంటలు విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. బెంగళూరు ఫ్లైట్ ఎక్కిన యువకుడు అందరిని మరిచిపోయి ప్రియురాలితో ప్రైవేట్ చాటింగ్ చేసుకుంటున్నాడు. అయితే ఆ చాటింగ్ మొత్తం పక్కనే ఉన్న వ్యక్తి చూస్తూ ఉన్నాడు.
ఆ చాటింగ్ మధ్యలో ప్రియురాలు ప్రేమికుడిని ఉద్దేశించి నువ్వో బాంబర్ ని అని టెక్స్ట్ చేసింది. దానిని చూసిన పక్క వ్యక్తి భయపడిపోయి ఫ్లైట్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో వారు విమానాన్ని ఆపేసి మొత్తం చెక్ చేశారు. ఆ తతంగం అంతా జరగడానికి 6 గంటల సమయం పట్టింది. తరువాత విమానం బయలుదేరి వెళ్ళింది. అయితే ప్రియరాలితో చాటింగ్ చేసిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అతన్ని ప్రయాణానికి అనుమతించలేదు. అతని ప్రియురాలిని కూడా విచారించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. మరి ఈ తంతు అంతా ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి. అయితే అది నార్మల్ చాటింగ్ అయినా కూడా దానిని చూసి ఫ్లైట్ సిబ్బందిని తప్పుదోవ పట్టించిన ప్రయాణికుడిని మాత్రం ఏమీ అనలేదు. ఈ సంఘటన మీడియాలో ప్రచారం కావడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.