ఫాంటసీ కథలలో ఎగిరే గుర్రాల గురించి మనం తెలుసుకున్నాం. అవి ఇప్పటికి ఉన్నాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. రెక్కల గుర్రాలని అశ్వినీ దేవతలు అని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. అలాగే నీటిపై తేలియాడే గుర్రాలు కూడా ఉన్నాయని అంటారు. అయితే నిజానికి ఇలాంటి రెక్కల గుర్రాలు, నీటిపై తేలే వాటిని ఇప్పటి వరకు మనం చూడలేదు. ఏవో సినిమాలలో చూడటం తప్ప. కానీ నిజంగా ఇప్పుడు ఓ చోట నీటిపై తేలే గుర్రాలు కెమెరా కంటికి చిక్కాయి. ఇప్పుడు ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విజువల్స్ చూసినపుడు ఆరంభంలో కచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే చివరికి వచ్చేసరికి అదొక ఆప్టికల్ ఇల్యూజన్ అనే విషయం అర్ధమవుతుంది.
Floating horses.. 😏
🎥 TT: worrylessandlivebig pic.twitter.com/7kbM1JYZJZ
— Buitengebieden (@buitengebieden) August 9, 2022
మనం ట్రైన్ లేదా బస్సులో ప్రయాణం చేసే సమయంలో వీడియో తీస్తే ప్రకృతిలో చెట్లు, ఆగి ఉన్న వాహనాలు కూడా కదులుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఈ వీడియో కూడా జరిగింది. అమెరికాలోని కెల్లీ రోజర్స్ అనే వృద్ధురాలు తన మనవళ్లతో బోటు షికారుకి వెళ్ళింది. ఆ బోటుని నడుపుతూ వారు వీడియో తీసుకున్నారు. ఆ వీడియోలో నీటిపై గుర్రాలు తేలి ఉన్నట్లు కనిపించింది. నిజానికి ఆ గుర్రాలు కాస్తా దూరంలో నీటిలో నిలబడి ఉన్నాయి అక్కడ నీరు గుర్రాల పాదాలు మునిగేంత వరకు మాత్రమే ఉంది. దీంతో ఆ వీడియోలో ఆప్టికల్ ఇల్యూజన్ కారణంగా గుర్రాలు నీటిపై తేలి ఉన్నట్లుకనిపించాయి . ఈ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక్క రోజులోనే ఈ వీడియోని ట్విట్టర్ లో సుమారు 7 లక్షల మంది చూడటం విశేషం.