సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతూ ఉంటాయి. కాస్తా ఇంటరెస్టింగ్ గా కనిపంచింది అంటే అలాంటి వీడియోలు ట్విట్టర్, షార్ట్ వీడియోల ద్వారా బాగా ప్రచారంలోకి వస్తాయి. వాటిని నెటిజన్లు కూడా విస్తృతంగా షేర్ చేయడం ద్వారా అవి ట్రెండింగ్ లోకి వస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. అది కూడా హైదరాబాద్ లో జరిగింది కావడం విశేషం. జులై 28న హైదరాబాద్ లో కుండపోతగా వర్షం పడింది. ఆ సమయంలో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. ఇక హైదరాబాద్ లో వర్షాల సమయంలో కార్లు, బైక్ లు కూడా కొట్టుకుపోతాయి. భారీ వర్షాల కారణంగా మూసి నది పరివాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చాలా సార్లు జరిగాయి. తాజాగా కురిసిన భారీ వర్షంలో బిర్యాని పాత్రలు రెండు తెలుతో వెళ్లడం ఎవరో వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు.
Somebody is going to be unhappy for not getting his biryani order.#Hyderabad #HyderabadRains pic.twitter.com/OPdXsjSoKs
— ibn crowley (@IbnFaraybi) July 28, 2022
ఈ వీడియోని ఏకంగా నాలుగు రోజుల్లో పది లక్షల మంది చూడటం విశేషం. ఇక ఈ వీడియో చూసిన చాలా మంది దానిని వీక్షించడంతో పాటు షేర్ చేస్తూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. వర్షంలో కూడా బిర్యానిని ఇలా ట్రాన్స్ పోర్ట్ చేయొచ్చు అంటూ కొందరు కామెంట్స్ చేయగా కొందరు సెల్ఫ్ డెలివరీ అని కొందరు లేటెస్ట్ హోమ్ డెలివరీ అంటూ కామెంట్స్ పెట్టారు. అందులో బిర్యానీ ఉంటే ఆ పాత్రలు ఎవరి ఇంటి దగ్గర ఆగితే వారికి పండగే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలా ఫన్నీ కామెంట్స్ తో ట్విట్టర్ లో ఈ వీడియో విస్తృతంగా వైరల్ కావడం విశేషం.