Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సౌత్ హిట్ మూవీ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. అలాగే యశ్ రాజ్ ఫిలిమ్స్ తో ఏక్ ది టైగర్ సిరీస్ లో మూడో భాగంలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే గాడ్ ఫాదర్ సినిమాతో సౌత్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన మార్కెట్ మరింత పెంచుకున్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఎక్కువగా వివాదాలలో ఇరుక్కున్న హీరో అంటే సల్మాన్ ఖాన్ అని చెప్పాలి. గతంలో కృష్ణజింకని వేటాడిన కేసులో ఇరుక్కున్నాడు. తరువాత ఫుట్ ఫాట్ పై ఉన్నవారిని కారుతో తొక్కించి ఒకరి చావుకి కారణమైన కేసులో ఇరుక్కున్నారు. ఈ ఘటనలో కొంత కాలం జైలు జీవితాన్ని కూడా అనుభవించారు.
ఇక ఓ జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న ఉదంతం కూడా వివాదంగా మారింది. ఇదిలా ఉంటే గత కొంత కాలంలో గ్యాంగ్ స్టార్ నుంచి సల్మాన్ ఖాన్ బెదిరింపులని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంలో గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ని చంపేస్తా అంటూ బెదిరించారు. అప్పట్లో సల్మాన్ ఖాన్ ని ముంబై పోలీసులు సెక్యూరిటీ కల్పించారు. ఇక తాజాగా మరోసారి గ్యాంగ్ స్టార్ లారెన్స్ మెయిల్ ద్వారా సల్మాన్ ఖాన్ ని బెదిరింపు లేఖలు పంపించడం సంచలనంగా మారింది.
సల్మాన్ ఖాన్ సన్నిహితుడికి రోహిత్ గార్గ్ పేరు తో ఈ బెదింపు ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. లారెన్స్ బీష్ణోయ్ ఈ మద్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చారని, అది సల్మాన్ చూసి ఉంటాడని, లేకుంటే చూడాలని ఆ లేఖ సారాంశం. ఇది హిదీలో పంపించారు. ప్రస్తుతం ఆ మెయిల్ ని పరిశీలిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. దీనిపై సల్మాన్ ఖాన్ టీమ్ పోలీసులకి ఫిర్యాదు చేయగా దీనిపై ఇప్పుడు విచారణ చేస్తున్నారు. లారెన్స్ గ్యాంగ్ పై కేసు నమోదు చేశారు.