బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా నటించిన సినిమా గంగూబాయ్ కథియావాడి. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతీలాల్ గడ ఈ సినిమాని నిర్మించారు. ఇదివరకే రిలీజైన ట్రైలర్, సినిమాపై చుట్టుకున్న వివాదాలు ఆలియా సినిమాను హైప్ లో తీసుకొచ్చాయి.
ఈ సినిమాలో తన తల్లి గంగూబాయ్ కథియావాడీని వేశ్యగా చూపించారంటూ ఆమె తనయుడు బాబూ రావుజీ షా కోర్టు మెట్లెక్కిన విషయం అందరికి తెలిసిందే! రిలీజ్‌ను సైతం అడ్డుకోవాలని చూసినప్పటికీ మూవీ విడుదలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసేసిన పలువురు నెటిజన్లు గంగూబాయ్ మూవీపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి నెటిజన్లు గంగూబాయ్ను మెచ్చుకుంటున్నారా? ఆలియాకు మంచి మార్కులు పడ్డాయా లేదా ? ఈ సినిమా తన కెరీర్‌కు ప్లస్ అయిందా? లేదా అనేది చూసేయండి..
గంగూబాయ్ కథియావాడిలో ఆలియా నటన అద్భుతమని కొందరు కీర్తిస్తుంటే ఈ సినిమా పూర్తయ్యేవరకు థియేటర్లో నిద్రపోతూనే ఉన్నామని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఆ పాత్ర గాంభీర్యానికి ఆలియా గొంతు సెట్ అవ్వలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీలు మాత్రం సినిమా అదిరిపోయిందని, ఆలియా పర్ఫామెన్స్‌కు మాటల్లేవ్ అని కామెంట్లు పెడుతున్నారు.
ఇది ఇలా ఉంటే అలియాభట్ నెగిటివిటి RRR మూవీ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి మరి.