కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకి భారీ అంచనాల మధ్య వచ్చింది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాకి పోటీగా ఈ మూవీ రావడంతో మీడియా బజ్ మొత్తం ఆ సినిమా వైపే వెళ్ళిపోయింది. ప్రమోషన్ యాక్టివిటీస్ చేసిన అవి ఎక్కువగా జనాల్లోకి వెళ్ళలేదు. అయితే కింగ్ నాగార్జునకి ఉన్న చరిష్మా, ఫేమ్ ఆడియన్స్ ని థియేటర్స్ వైపు రప్పిస్తుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు కూడా ఘోస్ట్ మూవీ ఫస్ట్ చూడటానికి ఇష్టపడతారు. లుసీఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ రావడంతో న్యూస్ కాన్సెప్ట్ చూడాలని అనుకునేవారికి ఘోస్ట్ వెల్ కమ్ చెబుతుంది. ఇక దానికి తగ్గట్లుగానే సినిమా ప్రేక్షకుల అద్బుతంగా రీచ్ అవుతున్నట్లు ఉంది. కింగ్ నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలతో చాలా సార్లు వచ్చాడు. ఈ సారి కూడా ఇండియన్ రా ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించారు.
కథ పరంగా చూసుకుంటే అందరికి తెలిసే లైన్ నే ప్రవీణ్ సత్తారు తీసుకున్నాడు. అయితే దానికోసం అల్లుకున్న కథనం మాత్రం ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు అదిరిపోయే ట్విస్ట్ లతో పెట్టాడు. తన మాఫియా గ్యాంగ్ వలలో చిక్కుకొని ప్రమాదంలో ఉన్న తన చెల్లి, మేనకోడలిని, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే ఎలిమెంట్స్ తో కథ ఉంటుంది. ఈ కథని నడిపించే విధానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాగ్ అయితే అంచనాలకి అందకుండా సరికొత్త ట్విస్ట్ తో ఉంటుంది. క్లైమాక్స్ లో కేజీఎఫ్ చాప్టర్ 2 తరహాలో పెద్దమ్మని నాగార్జున ఉపయోగించాడు. ఆ సీన్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో ఘోస్ట్ మూవీ కూడా బెస్ట్ క్లైమాక్స్ గా నిలుస్తుంది అనదంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. నాగార్జున ఇమేజ్ కి మించి ఖర్చు పెట్టిన దానికి తగ్గట్లుగానే అవుట్ పుట్ ఇచ్చాడు. గరుడవేగ సినిమా తర్వాత 5 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ప్రవీణ్ సత్తారు చేసిన సినిమా ఇది కావడంతో ఆ మూవీని మించి యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఘోస్ట్ మూవీని ప్రేక్షకులకి అందించాడు.
సినిమాలో కింగ్ నాగార్జున సీరియస్ లుక్ లో, మాసివ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇలాంటి పాత్రలు చేయడంలో నాగార్జున పెర్ఫెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీలో మరోసారి తనని తాను మళ్ళీ 90వ దశకంలోకి తీసుకెళ్లిపోయాడు. లుక్ పరంగా కూడా ఒకప్పటి నాగార్జునని గుర్తు చేశాడు. హీరోయిన్ సోనాల్ చాహన్ కి మొదటి సారి తనని తాను నటిగా ప్రూవ్ చేసుకునే పాత్ర తెలుగులో దొరికింది అని చెప్పాలి. ఇప్పటి వరకు గ్లామర్ కె పరిమితం అయిన ఈ బ్యూటీ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తో కూడా ఇరగదీసింది. అలాగే పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మెప్పించింది. బ్యాగ్రౌండ్ మూవీస్ కూడా యాక్షన్ సీక్వెన్స్ ని పెర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. ఇక దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు కథనం విషయంలో మరోసారి తన టాలెంట్ చూపించుకున్నారు. ప్రేక్షకులు కోరుకునే ఎమోషనల్ ఎలిమెంట్స్ ని పెర్ఫెక్ట్ గా డీల్ చేసాడు. అలాగే ప్రేక్షకులని థ్రిల్ చేసీ యాక్షన్ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో దసరాకి ఓ మంచి చిత్రాన్ని చూసిన ఫీలింగ్ అందించాడు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది.