God Rings: సాధారణంగా మనుషులందరూ చేతికి వెండి లేదా బంగారంతో తయారుచేసిన ఉంగరాలను ధరిస్తారు. చాలామంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తుంటారు. మరికొందరు వారి జాతక ప్రకారం రక రకాల స్టోన్స్ ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం భక్తితో దేవుడు ఉంగరాలను ధరిస్తుంటారు. ఎక్కువగా వెంకటేశ్వరస్వామి, సాయిబాబా, లక్ష్మీదేవి, గణపతి ఉంగరాలను ధరించడం మనం చూసే ఉంటాం. అయితే అసలు దేవుడి ప్రతిమ ఉంగరాలను ధరించవచ్చా.. ధరిస్తే ఏమవుతుందో చాలా మందికి తెలియదు.
చాలా మంది జ్యోతిష్యులు పచ్చరాయి, ఎరుపు రంగు రాయి ఉన్న ఉంగరాలు ధరించాలని సూచిస్తుంటారు. అయితే కొందరు రాళ్లు ఎందుకులే అని భావిస్తూ దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలు ధరిస్తే ఏ బాధలు ఉండవని ఇలాంటి ఉంగరాలను పెట్టుకుంటూ ఉంటారు. అలా దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరాన్ని చేతికి ధరించడం వల్ల దేవుడి దయ ఎప్పుడు తమపై ఉంటుందని.. తమ పనులు విజయవంతం అవుతాయని విశ్వసిస్తుంటారు.
దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడంలో కొన్ని పద్ధతులను పాటించాలని.. లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని పండితులు చెప్తున్నారు. దేవుడి ప్రతిమ కలిగిన ఉంగరం చేతికి ధరించినప్పుడు మనం తినే ఎంగిలి మెతుకులు దేవుడికి తగలకూడదు. అందువల్ల అన్నం తినడానికి ముందు ఉంగరాలను తీసివేసి తిన్న తర్వాత పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే కొందరు మాంసాహారం తింటుంటారు. అంతేకాక దేవుడికి మనం నైవేధ్యం పెట్టేటప్పుడు ఎంగిలి పెట్టం అనే భావన ఉంటుంది.
God Rings: దేవుడి ఉంగరాలను ఇలా పెట్టుకోవాలి
ఉంగరంలో ఉన్న దేవుడి ప్రథమ తల, మన మణికట్టు వైపు దేవుడి కాళ్లు, మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి. ఎందుకంటే మన శరీరం చేతి వేళ్ళ గోర్లు, భూమిని చూస్తూ ఉంటాయి. మహిళలు పీరియడ్స్ సమయం కంటే ముందే దేవుడి బొమ్మ ఉన్న ఉంగరాలు, లాకెట్లు తీసి భద్రపరుచుకోవాలి. మద్యపానం, ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తులు దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించి పొగ పీల్చడం, మద్యం సేవించడం చేయరాదు.